Share News

AP Elections: వైఎస్‌ జగన్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:22 PM

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఒకరు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ చేరిక జరిగింది.

AP Elections: వైఎస్‌ జగన్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ రెండు పార్టీలను కాదని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన మరెవరో కాదు.. గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ (Varaprasad Rao).

AP Elections 2024: కేశినేని చిన్నికి ఎంపీ టికెట్ ఎలా దక్కింది..?



Jagan-and-Varaprasad.jpg

ఎందుకీ చేరిక..?

గూడూరు వైసీపీ టికెట్ మేరుగ మురళీకి అధిష్టానం కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వరప్రసాద్ ఎమ్మెల్యేగా పోటీచేయాల్సిందేనని భావించారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా కాషాయ పార్టీలోకి వరప్రసాద్ చేరిపోయారు. కండువా కప్పిన కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే సిట్టింగ్ సీటు ఇవ్వకపోయినా ఫర్లేదు కానీ.. తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మాత్రం అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను వరప్రసాద్ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. 2014 ఎన్నికల్లో ఇదే లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన వరప్రసాద్ 37,425 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గూడురు నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఒకవేళ ఈయనకు సీటు కన్ఫామ్ అయితే.. 2024 ఉప ఎన్నికల్లో పోటీచేసిన కే. రత్నప్రభ పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2024 | 12:36 PM