Share News

Big Breaking: వైసీపీకి ఊహించని షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 19 , 2024 | 01:35 PM

Andhra Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు అధికార వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Thoguru Arthur) ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు..

Big Breaking: వైసీపీకి ఊహించని షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు అధికార వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (MLA Thoguru Arthur) ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం నాడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో ఆర్థర్ హస్తం గూటికి చేరారు. కండువా కప్పిన షర్మిల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా.. నందికొట్కూర్ నుంచి పోటీచేయడానికి వైసీపీ తరఫున ఆర్థర్‌కు టికెట్ దక్కలేదు. ఈయనకు హ్యాండిచ్చి దారా సుధీర్‌కు టికెట్ ఇచ్చింది వైసీపీ. ఆర్థర్ టికెట్ ఇవ్వొద్దని యువనేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఒకట్రెండు రోజులు తిష్టవేసి మరీ తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇప్పించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. గత ఎన్నికల్లో ఆర్థర్ విజయం కోసం కృషి చేసిన బైరెడ్డి.. ఇప్పుడు రివర్స్ అయ్యారు.


చేరిక సరే.. పోటీ!

టికెట్ రాకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆర్థర్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించి తీరాలని కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో వైఎస్ ఫ్యామిలీతో ఉన్న పరిచయాలతో షర్మిలను సంప్రదించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్ కానుంది. ఈ జాబితాలో ఆర్థర్ పేరు ఉంటుందని ఆయన అభిమానులు, అనుచరులు ఆశిస్తున్నారు. అయితే టికెట్ హామీతోనే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీలో చేరాలని అనుకున్నప్పటికీ ఇక్కడ్నుంచి అభ్యర్థి ఉండటంతో టికెట్ రాదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. పోటీ చేస్తే ఏ మాత్రం ఓట్లు రాలుతాయో..? వేచి చూడాల్సిందే మరి.

Updated Date - Mar 19 , 2024 | 01:49 PM