Share News

YS Sharmila: చెల్లి అనే ప్రేమ ఉంటే.. అవినాష్‌తో విత్ డ్రా చేయించాలని సవాల్

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:48 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు చెల్లి అనే ప్రేమ ఉంటే, మీ బాధ నిజమే అయితే అవినాష్ రెడ్డి చేత నామినేషన్ విత్ డ్రా చేయించాలని కోరారు.

YS Sharmila: చెల్లి అనే ప్రేమ ఉంటే.. అవినాష్‌తో విత్ డ్రా చేయించాలని సవాల్
YS Sharmila

తూర్పు గోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) బిజీగా ఉన్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు చెల్లి అనే ప్రేమ ఉంటే, మీ బాధ నిజమే అయితే అవినాష్ రెడ్డి చేత నామినేషన్ విత్ డ్రా చేయించాలని కోరారు. నేను ఓడిపాతాననే బాధ సీఎం జగన్‌కు ఉంటే అవినాష్‌ను ఎన్నిక నుంచి తప్పించాలని సవాల్ విసిరారు. చిన్నమ్మ లేఖ రాసినట్టు అవినాష్ రెడ్డిని ఎందుకు పోటీ నుంచి తప్పించడం లేదని షర్మిల అడిగారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల మాట్లాడారు.


‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోతే మీరు ఎంత బాధపడ్డారు ? ఆ ఎన్నికల్లో వివేకాను ఓడించింది అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కాదా ? అలాంటి వారికి టికెట్ ఇచ్చారు. నేను ఓడిపోతాననే నమ్మకం మీకు ఉంటే ఎందుకు భయం ? భయం లేకుంటే కుటుంబాన్ని మొత్తం ఎందుకు దించారు ? ఇంతమంది ఎందుకు ప్రచారం చేస్తున్నారు ? వైఎస్ఆర్ బిడ్డ, మీ చెల్లి అని చూడకుండా... నా గురించి... నా పుట్టుక గురించి.. నా పేరు గురించి ... ఎందుకు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు ? జగన్‌కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈ చర్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్ బిడ్డ ఎందుకు పోటీ చేస్తుందో జగన్‌కి అర్ధం అయ్యేలా చెప్తున్నా. అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వడంతో పోటీలోకి దిగా. చిన్నాన్నను చంపించిన హంతకుడికే టిక్కెట్ ఇచ్చారు కాబట్టే పోటీలోకి దిగా. ఇతర ఏ వ్యక్తికి టిక్కెట్ ఇచ్చినా నేను పోటీ చేయకుండా ఉండే దాన్ని. చిన్నాన్నను దారుణంగా హత్య చేశారు. సీబీఐ దర్యాప్తు కావాలి అని జగన్ అడిగారు. అధికారంలో వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నారు. ఎందుకు విచారణ వద్దన్నారో జగన్ కడప ప్రజలకు సమాధానం చెప్పాలి. కడప లోక్ సభ పోలింగ్ ధర్మానికి, డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు అని’ షర్మిల స్పష్టం చేశారు.


’ఎన్నికలో వైసీపీ ఓడిపోతే నేరం గెలిచిందని అర్థం. వైఎస్ఆర్ పేరును సీబీఐ చార్జిషీట్‌లో కాంగ్రెస్ చేర్చలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్‌లో లేకపోతే జగన్ చేర్చాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయించాడు. వైఎస్ఆర్ పేరును చార్జ్ షీట్‌లో చేర్పించారు. కేసుల నుంచి బయట పడటానికి జగన్ చేసిన దుర్మార్గపు చర్య అది. ఈ కుట్రకు కారణం జగన్. తప్పు చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీదకు నెట్టడం దుర్మార్గం. కేసుల నుంచి బయట పడటానికి వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్ పెట్టడం దుర్మార్గం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతా ఆలోచన చేయాలి. రిమోట్ కంట్రోల్ గురించి జగన్‌కి బాగా తెలుసు. గత 5 ఏళ్లుగా మోదీ చేతిలో జగన్ రిమోట్ కంట్రోల్. ఏ బటన్ నొక్కితే ఆ పని చేస్తున్నది జగన్. అదానికి పోర్టులు కట్టబెడుతుంది జగన్. వైఎస్ఆర్ మరణంలో రిలయన్స్ హస్తం ఉందని చర్చ జరిగినా ... అంబానీ చెప్పిన వాళ్లకు ఎంపీ పదవి. మణిపూర్ అల్లర్లు జరిగితే మాట్లాడకుండా రిమోట్ నొక్కితే సైలెంట్‌గా ఉంది జగన్ కదా..? మోదీ చేతిలో జగన్ రిమోట్ కంట్రోల్ అని’ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


Read latest
AP News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 12:48 PM