Share News

AP Elections:చావులతో రాజకీయం.. జగన్‌పై జనం ఆగ్రహం..!

ABN , Publish Date - Apr 08 , 2024 | 07:36 AM

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో విలువైనవి. ఐదేళ్ల పాటు ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే సమయం. అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తాం.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనేవి రాజకీయ పార్టీలు చెప్పుకుంటుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP)కి మాత్రం ఎన్నికలంటే గుర్తొచ్చేది చావులతో సానుభూతి రాజకీయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

AP Elections:చావులతో రాజకీయం.. జగన్‌పై జనం ఆగ్రహం..!

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో విలువైనవి. ఐదేళ్ల పాటు ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే సమయం. అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తాం.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనేవి రాజకీయ పార్టీలు చెప్పుకుంటుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP)కి మాత్రం ఎన్నికలంటే గుర్తొచ్చేది చావులతో సానుభూతి రాజకీయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. 2019 ఎన్నికలకు ముందు జగన్ సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య. తన బాబాయిని రాజకీయ ప్రత్యర్థులు చంపేశారని, తమ ఎదుగుదలను చూడలేకపోతున్నారని ప్రచారం చేస్తూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే. వైసీపీకి ఓట్లు వేసిన తరువాత బాబాయిని హత్య చేసిందేవరో ప్రజలకు తెలిసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వివేకా(Viveka) హత్య జరిగి ఐదేళ్లవుతోంది. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఐదేళ్ల పాలనపై విరక్తి చెందిన ప్రజలు జగన్‌ను గద్దె దించేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో మరోసారి సానుభూతి రాజకీయాలకు జగన్ తెరలేపారనే చర్చ జరుగుతోంది. తాను ఓటమి నుంచి తప్పించుకోలేనని గ్రహించిన జగన్ సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారుల కేంద్రంగా సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఐదేళ్లలో జగన్ మోసాలు తెలిసిన జనం.. జగన్ పాచికలు పారకుండా అడ్డుకట్ట వేశారు.

Balasouri: మూడు రాజధానుల పేరుతో ఏపీని నాశనం చేసిన సీఎం జగన్‌


అసత్యాల ప్రచారం..

వైసీపీ అధికారంలోకి రాకపోతే పెన్షన్లు ఆగిపోతాయని, ఇంటింటికి ఫించను ఇచ్చే విధానం విపక్షాలకు ఇష్టం లేదంటూ ఓ విష ప్రచారానికి తెరలేపారు సీఎం జగన అండ్ కో. వాస్తవానికి వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో వైసీపీ అధినేత జగన్‌లో టెన్షన్ మొదలైనట్లు కనిపించింది. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే వాళ్లతోనే సులువుగా మే నెల మొదటివారంలో ఎన్నికల డబ్బులు పంచేయాలని వైసీపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యూహానికి అడ్డుకట్ట పడటంతో మరో నాటకానికి జగన్ తెరలేపారనే ప్రచారం జరుగుతోంది. వాలంటీర్లతో రాజీనామాలు చేయించి వాళ్లతో ఎన్నికల ప్రచారం చేయించుకోవాలని, ఓట్ల కొనుగోలుకు వాళ్లతోనే డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది వాలంటీర్లు మాత్రం వైసీపీ ప్రలోభాలకు లొంగడంలేదట. ప్రజల అభిమానంతో కాకుండా.. కుట్రలు, కుతంత్రాలతో అధికారంలోకి వచ్చేందుకు రోజుకో ప్లాన్‌తో వైసీపీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.


తస్మాత్ జాగ్రత్త..

సానుభూతి రాజకీయాలు చేయడంలో ఆరితేరిన జగన్ ఎన్నికల లోపు మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అధికారం, పదవి కోసం సొంత మనుషులనే చంపించానే ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్.. మరోసారి అధికారంలోకి రావాలనే ఆశతో ఎలాంటి నీచానికైనా దిగజారవచ్చనే ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు మరో 35 రోజుల సమయం ఉంది. ఈలోపు ఓటర్లంతా జాగ్రత్తగా ఉండాలని, జగన్ నీచ రాజకీయాలకు, కుట్రలకు బలి కావద్దని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు.


YSRCP VS TDP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. టీడీపీ నేతలపై దాడి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2024 | 07:36 AM