Share News

ABN Big Debate Live: సీఎం రమేశ్‌తో ఏబీఎన్ ఎండీ ఆర్కే ‘బిగ్ డిబేట్’.. ఆసక్తికర రాజకీయ చర్చ!

ABN , First Publish Date - Apr 22 , 2024 | 07:18 PM

‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) సిద్ధమయ్యారు. నేటి (సోమవారం) ‘బిగ్ డిబేట్’ చర్చకు బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్ పాల్గొన్నారు. రాధాకృష్ణ గారు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నారు. లైవ్‌లో ఈ చర్చా కార్యక్రమాన్ని వీక్షించండి.

ABN Big Debate Live: సీఎం రమేశ్‌తో ఏబీఎన్ ఎండీ ఆర్కే ‘బిగ్ డిబేట్’.. ఆసక్తికర రాజకీయ చర్చ!

Live News & Update

  • 2024-04-22T20:47:12+05:30

    సీఎం రమేశ్: అవినాష్‌రెడ్డి తప్పకుండా అరెస్ట్‌ అవుతాడు. స్పష్టమైన ఆధారాలున్నాయని అమిత్‌షా చెప్పారు. అమిత్‌షాకు అన్నీ తెలుసు. ఏడాదిన్నర క్రితమే అమిత్‌షా నాతో చెప్పారు. టైమ్‌ వచ్చినప్పుడు కచ్చితంగా అరెస్ట్ అవుతాడు. జగన్‌, భారతి ప్రమేయం ఉంది. వాళ్ల అనుమతి లేకుండా జరుగుతుందా?. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు.

  • 2024-04-22T20:40:28+05:30

    సీఎం రమేశ్: జగన్‌ పేరు చెప్పి ప్రధాని తిట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయం బీజేపీకి అర్థమైంది. అవినాశ్‌ను అరెస్ట్‌ చేయాలనే సీబీఐ అధికారులు వచ్చారు. వాళ్లు తప్పు చేశారు.. తప్పకుండా పెద్ద శిక్షే పడుతుంది. జగన్‌పై చాలా వ్యతిరేకత ఉంది. ఎవరు పోటీ చేసినా గెలుస్తారు. నేనే కావాలని అనకాపల్లి ప్రజలు కోరుకుంటున్నారు. ముత్యాల నాయుడు అభివృద్ధి చేయలేడని ప్రజలకు తెలుసు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపగలను. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించాను.

  • 2024-04-22T20:37:41+05:30

    సీఎం రమేశ్: నా తరపున, నా భార్య కుటుంబానికి చెందిన మొత్తం 150 మంది అనకాపల్లి నియోజకవర్గంలో పని చేస్తున్నారు. 86 ఏళ్ల వయసులో మా నాన్న కూడా పనిచేస్తున్నారు.

  • 2024-04-22T20:34:10+05:30

    సీఎం రమేశ్: ఎంపీగా గెలిస్తే అనకాపల్లిలో సొంతంగా హైడ్రోజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాను. 5 వేల నుంచి 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇథనాల్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తాను. ఈ రెండు ప్రాజెక్టులను వెంటనే ప్రారంభిస్తాను. 30-40 వేల ఉద్యోగాలు ఇప్పిస్తాను. మహిళలకు కూడా ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది.

    Untitled-9.jpg

  • 2024-04-22T20:24:23+05:30

    సీఎం రమేశ్: అనకాపల్లి సీటు నాకు ఇవ్వబోతున్నారని తెలిసి సత్యవతి పేరుని వైఎస్ జగన్ ప్రకటించలేదు. ఆ తర్వాత ముత్యాల నాయుడి పేరుని ప్రకటించారు. ఆయన ప్రజల్లోకే వెళ్లడం లేదు. ముత్యాల నాయుడు బలహీన అభ్యర్థి అని జగన్‌కు తెలిసింది. నేను గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలను. స్టీల్ ప్లాంట్‌ను మరింత ఆధునీకరిస్తా.

  • 2024-04-22T20:16:34+05:30

    సీఎం రమేశ్: ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఎవరూ ప్రభావితం చేయలేరు. కేంద్ర మంత్రుల కంటే ఎక్కువ పనులు నాకు జరుగుతున్నాయి.

  • 2024-04-22T20:10:42+05:30

    సీఎం రమేశ్: ప్రధాని మోదీ డిన్నర్ ఏర్పాటు చేశారు. జగన్ ఇసుక దోపిడీ, భూకబ్జాలు అన్నింటినీ చూపించారు. కేంద్రప్రభుత్వ పథకాలను జగన్ ఎలా స్టిక్కర్ వేస్తున్నాడో అందరికీ తెలుసు.

    Untitled-8.jpg

  • 2024-04-22T20:08:51+05:30

    సీఎం రమేశ్: సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరు ఎత్తడానికి ప్రధాని మోదీ ఇష్టపడలేదని నాకు అనిపించింది. ప్రధాని సిబ్బంది మాటల్లో కూడా ఈ విషయం నాకు అర్థమైంది. అందుకే చిలకలూరిపేట బహిరంగ సభలో జగన్ పేరును ప్రధాని మోదీ పలకలేదు.

  • 2024-04-22T20:01:20+05:30

    సీఎం రమేశ్: గత ఎన్నికలు వేరు.. ఈసారి వేరు. ఈ ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం బాగా పని చేసింది. ప్రజలు కూడా అభివృద్ధిని చూస్తున్నారు. కూటమి ఏర్పడ్డాక గెలుపు నల్లేరు మీద నడకే. జగన్‌ను ఎప్పుడు దించాలా అని ప్రజలు చూస్తున్నారు. జగన్‌పై జనం కసి తీర్చుకుంటామంటున్నారు. జగన్‌ అనర్గళంగా అబద్ధాలు చెప్తున్నారు. పేదోడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్నారు. జగన్‌ ఒక అవకాశం ఇవ్వాలంటే జనం నమ్మారు. ఒక అవకాశం ఇచ్చినందుకు ఐదేళ్లు బాధపడ్డారు. బహిరంగ సభలో అవినాశ్ రెడ్డిని పక్కన పెట్టుకుని వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసన్నారు. తన ఇంట్లో ఆడబిడ్డలకే న్యాయం చేయలేకపోతున్నారు.

    Untitled-7.jpg

  • 2024-04-22T19:58:49+05:30

    సీఎం రమేశ్: ప్రజా స్పందనతో అనకాపల్లి ఎన్నికల్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. అసెంబ్లీకి స్థానికుడైతే బాగుంటుంది. పార్లమెంట్‌ అభ్యర్థికి పరిచయాలు, పలుకుబడి కావాలి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని దేశమంతా తెలుసు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారు. ఈ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక్క జగన్‌ తప్పితే.. దేశంలో ఏ సీఎంతో అయినా మాట్లాడగలను.

  • 2024-04-22T19:49:29+05:30

    సీఎం రమేశ్: నేను ఎంపీగా గెలవాలని చిరంజీవి ఆశించారు. అందుకే చిరంజీవి నాకు మద్దతు పలికారు. హిందీ, ఇంగ్లీష్‌, తమిళం, కన్నడ బాగా మాట్లాడతాను. అమిత్‌షా, మోదీతో ఇంగ్లీష్‌, హిందీలో మాట్లాడతా. టీడీపీలో నేను, రేవంత్‌ కలిసి పనిచేశాం. స్నేహం వేరు.. రాజకీయం వేరు. నాకు చాలా పార్టీల్లో స్నేహితులు ఉన్నారు.

  • 2024-04-22T19:45:24+05:30

    ఆర్కే: కడపలో షర్మిల గెలుస్తారా?

    సీఎం రమేశ్: షర్మిల కడపలో గెలుస్తారో లేదో తెలియదు. కానీ ఆమె రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపిస్తారు. అక్కాచెల్లెలు ఏడిపించినవారికి ఉసురు తగులుంది. వైఎస్ వివేకాను చంపి సొంత కూతురి మీదనే నెట్టడం చాలా దారుణం.

    Untitled-6.jpg

  • 2024-04-22T19:42:58+05:30

    సీఎం రమేశ్: నాకు రెంటల్ ఆదాయం వస్తుంది. నాకు, నా భార్యకు అద్దెల మీద నెలకు రూ.25 లక్షల ఆదాయం వస్తుంది. పార్లమెంట్ సభ్యుడిగా కూడా జీతం వస్తుంది.

  • 2024-04-22T19:39:46+05:30

    సీఎం రమేశ్: బీజేపీ ఓట్లు పెరిగాయి. ఇదే సమయంలో కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన ఓట్లు సహజసిద్ధంగా పడతాయి. ఆ ధైర్యం, నమ్మకంతో అనకాపల్లిలో పోటీ చేస్తున్నాను. అయినా జగన్‌ను దించాలనే లక్ష్యంతోనే ఓటర్లు ఎదురుచూస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. పోయినసారి జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు జనాలు బాధపడుతున్నారు. వివేకాను చంపిన అవినాశ్ రెడ్డిని పక్కనే పెట్టుకొని ఎవరు చంపారో దేవుడికి తెలుసు అని జగన్ అంటున్నారు(నవ్వుతూ).

  • 2024-04-22T19:36:00+05:30

    సీఎం రమేశ్: రామ్ చరణ్ ఢిల్లీ వచ్చాడు. సన్మానించాలని అమిత్ షాను కోరాను. ఆయన సన్మానించారు. పార్లమెంట్‌లో నా పనితనాన్ని, సామర్థ్యాన్ని అమిత్ షా గుర్తించారు. సక్సెస్ అయ్యేదాకా వదిలిపెట్టను. నాకు చాలా పార్టీల్లో స్నేహితులు ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్ప దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఫోన్ చేసి మాట్లాడగలను. నాకు అలాంటి పరిచయాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా పరిచయాలు ఉన్నాయి.

  • 2024-04-22T19:30:49+05:30

    సీఎం రమేశ్: 30 ఏళ్ల వయసులోనే చిత్తూరులోనే పోటీ చేయాలనుకున్నాను. నేను పోటీ చేస్తే గెలుస్తానని చాలా మంది అన్నారు. కానీ అప్పుడు నాకు చాలా వయసుందని అన్నారు. ఇప్పుడు తొలిసారిగా పోటీ చేస్తున్నప్పటికీ నాకు టెన్షన్ లేదు. వైఎస్సార్ టైమ్‌లోనే రాజకీయాలు నడిపాను. సక్సెస్ అయ్యే వరకు వదిలిపెట్టను.

  • 2024-04-22T19:25:26+05:30

    ఆర్కే: చిరంజీవి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. అందరివాడిగా ఉండాలనే అభిలాషతో దూరంగా ఉంటున్న ఆ వ్యక్తిని ఎలా బుట్టలో వేసుకున్నావ్.

    సీఎం రమేశ్: చిరంజీవి గారూ, నేను రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు మంచి మిత్రులమయ్యాం.

  • 2024-04-22T19:20:35+05:30

    తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం పున:ప్రారంభమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నేపథ్యంలో ఈ చర్చా కార్యక్రమానికి హాజరయ్యే రాజకీయ నేతలను ముక్కుసూటిగా ప్రశ్నించేందుకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) సిద్ధమయ్యారు. నేటి (సోమవారం) ‘బిగ్ డిబేట్’ చర్చకు బీజేపీ సీనియర్ నేత, అనకాపల్లి ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్ పాల్గొన్నారు. రాధాకృష్ణ గారు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తున్నారు. లైవ్‌లో ఈ చర్చా కార్యక్రమాన్ని వీక్షించండి.