Share News

CM Jagan: అన్నీ జగన్ ఖాతాలోకే... సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సీఎం

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:24 PM

Andhrapradesh: కేంద్ర పరిధిలో జరిగిన పనులు ఆయన ఖాతాలోకే. టీడీపీ హయాంలో జరిగిన వాటిని కూడా తన గొప్పలుగా చెప్పుకుంటున్నారు సీఎం జగన్. ఈరోజు (మంగళవారం) కనకదుర్గ వారధి వద్ద రిటైనింగ్ వాల్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అయితే టీడీపీ హయంలోనే కేంద్ర సహకారంతో 72 శాతానికి పైగా పూర్తైన కనకదుర్గ ప్లైఓవర్‌ను తన ఘనతగా చెప్పుకున్నారు ముఖ్యమంత్రి.

CM Jagan: అన్నీ జగన్ ఖాతాలోకే... సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సీఎం

విజయవాడ, మార్చి 12: కేంద్ర పరిధిలో జరిగిన పనులు ఆయన ఖాతాలోకే. టీడీపీ హయాంలో జరిగిన వాటిని కూడా తన గొప్పలుగా చెప్పుకుంటున్నారు సీఎం జగన్. ఈరోజు (మంగళవారం) కనకదుర్గ వారధి వద్ద రిటైనింగ్ వాల్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి (CM Jagan mohan Reddy) ప్రారంభించారు. అయితే టీడీపీ (TDP) హయంలోనే కేంద్ర సహకారంతో 72 శాతానికి పైగా పూర్తైన కనకదుర్గ ప్లైఓవర్‌ను తన ఘనతగా చెప్పుకున్నారు ముఖ్యమంత్రి.

Vijayawada: ఇదెక్కడి నరకం సామీ... సీఎం జగన్ పర్యటనతో ట్రాఫిక్ కష్టాలు

కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను కూడా జగన్ తన ఖాతాలోకి వేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక విజయవాడ ఎయిర్ పోర్టును (Vijayawada Airport) జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. అయితే తన ప్రసంగంలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి రెండు ఫ్లైఓవర్‌లు తామే పూర్తి చేశామంటూ జగన్ సొంత డబ్బాలు కొట్టుకున్నారు. నిజానికి రెండు ప్లైవోవర్‌లకు గత టీడీపీ హయాంలోనే అనుమతులు మంజూరు అయిన విషయాన్ని ముఖ్యమంత్రి దాచిపెట్టేశారు. ఔటర్ రింగ్ రోడ్డు ఖాజా నుంచి చిన్న అవుటుపల్లి వెళ్లే పనులు రెండు నెలల్లో ప్రారంభమవుతాయంటూ సీఎం పచ్చి అబద్దాలు చెప్పుకొచ్చారు. ఇది కూడా కేంద్ర హయాంలో నడిచే ప్రాజెక్టు అయినా జగన్ మాత్రం తన ఖాతాలో వేసేసుకున్నారు.

Warangal: 16న పెళ్లి... అంతలోనే విషాదం


జగన్ స్పీచ్ ఇదే..

కనకదుర్గ వారధి వద్ద రిటైనింగ్ వాల్‌ను సీఎం జగన్ ప్రారంభించి ఆపై ప్రసంగిస్తూ... విజయవాడలో ఇళ్ల పట్టాలను సంపూర్ణ హక్కలతో అందజేసే కార్యక్రమం చేస్తున్నామని.. అభ్యంతరాలు లేని 9125 పట్టాలు రెగ్యులరైజ్ చేస్తున్నామని తెలిపారు. భ్రమరాంభపురంలో స్మశానం ఇష్యూ ఉందని దాన్ని పరిష్కరించి అక్కడి ఇళ్ళను రెగ్యులరైజ్ చేస్తున్నామన్నారు. ఈ ఇబ్బందులు అన్నింటికి పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. కృష్ణానది వెంబడి రెండు కరకట్ట గోడలు రూ.500 కోట్లతో కట్టామని.. దీని వల్ల కృష్ణ లంక ముంపును నివారించామని తెలిపారు. కరకట్టగోడ కట్టడమే కాకుండా దీన్ని సుందరమైన పార్కుగా తీర్చిదిద్దామన్నారు. విజయవాడలో అంబేద్కర్ పార్కను కూడా ప్రారంభించామని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

TSRTC: తెలంగాణలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయోచ్..

BJP: బీజేపీ కూటమిలో చేరిన శరత్‌కుమార్‌ పార్టీ.. సీట్ల సర్దుబాటుపై చర్చలు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 12 , 2024 | 12:54 PM