Share News

Vijayawada: ఇదెక్కడి నరకం సామీ... సీఎం జగన్ పర్యటనతో ట్రాఫిక్ కష్టాలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:28 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో విజయవాడలో వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుని నరకాన్ని చవిచూస్తున్నారు. మంగళవారం నాడు విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్ద రిటైనింగ్ వాల్, అక్కడ ఏర్పాటు చేసిన చిన్న పార్క్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. దీంతో జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద నుంచి ట్రాఫిక్‌ను నిలిపివేశారు.

Vijayawada: ఇదెక్కడి నరకం సామీ... సీఎం జగన్ పర్యటనతో ట్రాఫిక్ కష్టాలు

అమరావతి, మార్చి 12: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) పర్యటన నేపథ్యంలో విజయవాడలో (Vijayawada) వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుని నరకాన్ని చవిచూస్తున్నారు. మంగళవారం నాడు విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్ద రిటైనింగ్ వాల్, అక్కడ ఏర్పాటు చేసిన చిన్న పార్క్‌ను ముఖ్యమంత్రి జగన్ (AP CM) ప్రారంభించనున్నారు. దీంతో జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద నుంచి ట్రాఫిక్‌ను నిలిపివేశారు. సర్వీస్ రోడ్లపైకి ట్రాఫిక్ మళ్లిస్తున్న పరిస్థితి. కనకదుర్గమ్మ వారధిపై (Kanakadurgamma bridge) రెండు వైపులా ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. అటు ప్రకాశం బ్యారేజ్‌పై కూడా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి సగానికిపైగా నిర్మించిన రిట్టైనింగ్ వాల్‌‌కు ఇప్పుడు ఓపెనింగ్ జరుగుతోంది. దీని కోసం జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేసి మరీ ప్రయాణికులకు పోలీసులు నరకం చూపిస్తున్నారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వారధికి రెండు వైపులా నిలిపి వేశారని బ్యారేజ్ వైపు వస్తే అక్కడా ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి...

BTech Ravi: ఆ భయంతోనే పులివెందులలో మెడికల్ కాలేజీ ప్రారంభం

Warangal: 16న పెళ్లి... అంతలోనే విషాదం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 12 , 2024 | 11:37 AM