Share News

BJP: బీజేపీ కూటమిలో చేరిన శరత్‌కుమార్‌ పార్టీ.. సీట్ల సర్దుబాటుపై చర్చలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:14 PM

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరినట్లు ఆలిండియా సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు శరత్‌ కుమార్‌(Sharath Kumar) ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు దీటుగా బలమైన కూటమి ఏర్పాటులో బీజేపీ నిమగ్నమైంది.

BJP: బీజేపీ కూటమిలో చేరిన శరత్‌కుమార్‌ పార్టీ.. సీట్ల సర్దుబాటుపై చర్చలు

చెన్నై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరినట్లు ఆలిండియా సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు శరత్‌ కుమార్‌(Sharath Kumar) ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు దీటుగా బలమైన కూటమి ఏర్పాటులో బీజేపీ నిమగ్నమైంది. ఇప్పటికే టీఎంసీ, ఐజీకే, పుదియ నీతి కట్చి సహా ఆరు పార్టీలు ఈ కూటమిలో చేరాయి. ఈ క్రమంలో, బీజేపీ కూటమిలో చేరనున్నట్లు ఇదివరకే ప్రకటించిన శరత్‌కుమార్‌ సోమవారం టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai), కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి(Kishan Reddy), వీకే సింగ్‌తో శరత్‌కుమార్‌ భేటీ అయ్యారు. కూటమిలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు జరిగాయని, ఒకటి, రెండు రోజుల్లో సీట్ల కేటాయింపుపై అధికారికంగా ప్రకటిస్తామని శరత్‌కుమార్‌ తెలిపారు.

nani2.jpg

Updated Date - Mar 12 , 2024 | 12:14 PM