Share News

JP Nadda: తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ABN , Publish Date - May 11 , 2024 | 07:25 AM

చిత్తూరు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతికి రానున్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో నిర్వహించనున్నారు. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుంచి నాలుగకాళ్ళ మండపం వరకు రోడ్డు షో సాగనుంది.

JP Nadda: తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

చిత్తూరు జిల్లా: ఎన్నికల ప్రచారంలో (Election Compaign) భాగంగా బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) శనివారం తిరుపతి (Tirupati)కి రానున్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన తిరుపతిలో రోడ్డు షో (Road Show) నిర్వహించనున్నారు. జ్యోతిరావు పులే విగ్రహం వద్ద నుంచి నాలుగకాళ్ళ మండపం వరకు రోడ్డు షో సాగనుంది. నడ్డాతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh), జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు (Nagababu) రోడ్డు షోలో పాల్గొననున్నారు.


అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి తరపున ప్రచారం కోసం జేపీ నడ్డా ఆదోనికి వెళతారు. నగరంలోని మున్సిపల్‌ మైదానంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి, టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు గెలుపు కోసం ఆయన ఆదోనికి వస్తున్నారు.

కాగా సార్వత్రిక ఎన్నికలు సోమవారం జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. బహిరంగ సభలు, రోడ్‌షో తరహా ప్రచారం ముగిసినా, ఇంటింటి ప్రచారాలకు ఆదివారమూ అనుమతి ఉంది. మరిన్ని వివరాలను కలెక్టర్‌ షన్మోహన్‌, ఎస్పీ మణికంఠ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.


ఫిర్యాదుల కోసం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తో సహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఆర్వో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు. ప్రజలు అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. పోలింగ్‌ రోజున ఇబ్బందికర ఘటనలు జరిగితే సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.


పోలింగ్‌ రోజున జరిగేదిదే : పోలింగ్‌ రోజు 13వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ఉండాలి. 5:30 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలి. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభించాలి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. ఆ తర్వాత ఓటర్లు క్యూలో ఉంటే స్లిప్పులు అందిస్తారు.


బయటి ప్రాంతాల వారు వెళ్లిపోవాలి : ఓటు హక్కు లేనివారు, ప్రచారాల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారు శనివారం సాయంత్రంలోగా వెళ్లిపోవాలి. 6 గంటల తర్వాత నుంచి 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను పంపించేయమని హోటళ్లు, కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాల్స్‌ వారికి పోలీసులు నోటీసులిచ్చారు.

4 వేల మంది బైండోవర్‌ : జిల్లాలో 4 వేల మందిని పోలీసులు బైండోవర్‌ చేశారు. వారి నుంచి ముందస్తుగా రూ.4.50 లక్ష డిపాజిట్‌ చేసుకున్నారు. మరికొంతమంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సమయంలో వారు ఇబ్బందులు సృష్టిస్తే కేసులు తప్పవు.


బయటి పోలీసులకే బాధ్యత: తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పోలీసులు జిల్లాకు వచ్చారు. ఇప్పటికే కేంద్ర బలగాలు జిల్లాలో ఉన్నాయి. చెక్‌పోస్టులు పెంచేసి, తనిఖీలు విరివిగా చేస్తున్నారు. లోకల్‌ పోలీసు సిబ్బంది పార్టీలకు అనుకూలంగా వ్యవహరించ వచ్చనే ఉద్దేశంతో బయటి ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులకు ఆయా కేంద్రాల వద్ద బాధ్యతను అప్పగిస్తారు. లోకల్‌ పోలీసులు వారికి అసిస్ట్‌ మాత్రమే చేస్తారు.

నేటి రాత్రి 7 నుంచి 144 సెక్షన్‌ అమలు

చిత్తూరు పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి 7 నుంచి 14వ తేదీ రాత్రి 7 గంటల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ సభలు నిషేధించామని, గుంపులుగా వెళ్లడానికి అనుమతి లేదని, పోలింగ్‌ కేంద్రాల సమీపంలో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతి లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

ఆస్తుల రక్షణ కోసం కూటమికే ఓటేయండి

జగన్‌కు ఓటేస్తే ఉరితాడే!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 11 , 2024 | 07:27 AM