Share News

Nara Bhuvaneswari: బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి..

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:22 AM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనమ్మకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయం నుంచి భువనేశ్వరి కుప్పం బయలుదేరారు.

Nara Bhuvaneswari: బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి..

బెంగళూరు/అమరావతి 20: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) మంగళవారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయానికి (Banglore Airport) చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనమ్మకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయం నుంచి భువనేశ్వరి కుప్పం (Kuppam) బయలుదేరారు. ఈరోజు కుప్పం నియోజవకర్గంలో భువనమ్మ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మూడు అన్నా క్యాంటీన్లను (Anna Canteen) ప్రారంభించనున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం చేయనున్నారు.

కాగా... చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెంది మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) పేరుతో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను ఓదారుస్తున్నారు. వారికి ఆర్థిక సాయం అందిస్తూ.. టీడీపీ అండగా ఉంటుందంటూ భువనేశ్వరి భరోసా ఇస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 20 , 2024 | 11:22 AM