Share News

Rave Party: ఇవాళ నటి హేమ సహా 8 మందిని విచారించనున్న సీసీబీ

ABN , Publish Date - May 27 , 2024 | 10:41 AM

బెంగుళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 8 మందికి సీసీబీ నోటీసులు జారీ చేసింది. నేడు బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇవాళ నటి హేమ సహా 8 మందిని సీసీబీ విచారించనుంది. విచారణకు రాని పక్షంలో కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో 101 మందిని పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయినట్టు తెలుస్తోంది.

Rave Party: ఇవాళ నటి హేమ సహా 8 మందిని విచారించనున్న సీసీబీ

బెంగళూరు: బెంగుళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 8 మందికి సీసీబీ నోటీసులు జారీ చేసింది. నేడు బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇవాళ నటి హేమ సహా 8 మందిని సీసీబీ విచారించనుంది. విచారణకు రాని పక్షంలో కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో 101 మందిని పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకున్న 86 మందికీ సీసీబీ నోటీసులు జారీ చేస్తోంది.

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి


బెంగళూరు రేవ్‌ పార్టీ (Rave Party) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ పోలీసులు జారీ చేసింది. వీరిలో నటి హేమ కూడా ఉంది. డ్రగ్స్‌ తీసుకున్న వారందరికీ సీసీబీ పోలీసులు నోటీసులు పంపుతున్నారు. అయితే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ అని తేలింది. వీరిలో నటి హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసుతో పాటు పలువురు ఉన్నారు. అయితే హేమ మాత్రం తాను రేవ్ పార్టీలో లేనంటూ బుకాయించింది. హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. కట్ చేస్తే బెంగుళూరు పోలీసులు హేమ ఫోటోను రిలీజ్ చేశారు. అంతే సీన్ మాత్రం రివర్స్. హేమ ఈ పార్టీకి తన పేరుతో కాకుండా కృష్ణవేణి అనే పేరుతో హాజరైంది. పోలీసు రికార్డుల్లోనూ హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేయడం జరిగింది.

Jagan Govt : గల్లా పెట్టెలు ఖాళీ

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 27 , 2024 | 10:41 AM