Share News

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి

ABN , Publish Date - May 27 , 2024 | 08:41 AM

ఉదయాన్నే ఆనందంగా కారులో బయలుదేరిన వారి ఆనందం ఆవిరవడానికి ఎంతో సేపు పట్టలేదు. అతి వేగమో.. నిర్లక్ష్యమో.. కారణం ఏదైనా కానీ ప్రమాదం మాత్రం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది. గమ్య స్థానానికి చేరే లోపు కారులోని నలుగురు వ్యక్తులు తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు. ఏం జరిగిందనేది కూడా తెలియక ముందే కన్నుమూశారు. రోడ్డు ప్రమాదం నలుగురిని పొట్టనబెట్టుకోగా.. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి

విజయవాడ: ఉదయాన్నే ఆనందంగా కారులో బయలుదేరిన వారి ఆనందం ఆవిరవడానికి ఎంతో సేపు పట్టలేదు. అతి వేగమో.. నిర్లక్ష్యమో.. కారణం ఏదైనా కానీ ప్రమాదం మాత్రం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది. గమ్య స్థానానికి చేరే లోపు కారులోని నలుగురు వ్యక్తులు తిరిగి రాని లోకాలకు పయనమయ్యారు. ఏం జరిగిందనేది కూడా తెలియక ముందే కన్నుమూశారు. రోడ్డు ప్రమాదం నలుగురిని పొట్టనబెట్టుకోగా.. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.

Jagan Govt : గల్లా పెట్టెలు ఖాళీ


కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడం ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన క్షతగాత్రుడిని వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 27 , 2024 | 08:41 AM