Share News

Atchannaidu: అచ్చెన్నాయుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:54 PM

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ కలిగింది. స్కిల్ కేస్‌లో ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Atchannaidu: అచ్చెన్నాయుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

అమరావతి: టీడీపీ (TDP) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి (Atchannaidu) కి ఏపీ హైకోర్టు (AP High Court)లో బిగ్ రిలీఫ్ కలిగింది. స్కిల్ కేస్‌ (Skill Case)లో ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ తరపు న్యాయవాది సమయం కోరారు. విచారణ ఏప్రిల్ 2 కి వాయిదా పడింది. అప్పటి వరకూ పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Bhuma Akhila Priya: వైఎస్ జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన అఖిల.. ఎమ్మెల్యే వర్గం రాళ్లదాడి!

కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో నిందితుల జాబితా క్రమక్రమంగా పెరుగుతూ పోయిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu)ను అరెస్టు చేసిన సీఐడీ (CID) విజయవాడలోని కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్లను కూడా చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అచ్చెన్నాయుడు హైకోర్టులో దాఖలు చేయగా.. ఆయనపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది.

Breaking: జగన్, అవినాష్ రెడ్డిల నుంచి రక్షించాలన్న దస్తగిరి పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 28 , 2024 | 01:54 PM