Share News

AP News: చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్ల్యూజే బృందం

ABN , Publish Date - Feb 26 , 2024 | 04:40 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏపీయూడబ్ల్యూజే బృందం సోమవారం భేటీ అయ్యింది. జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టాలని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నేతలు కోరారు. టీడీపీ హయాంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పెట్టిన పలు పథకాలను జగన్ రద్దు చేశారని చంద్రబాబుకు జర్నలిస్తులు వివరించారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని నేతలు తెలిపారు.

AP News: చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్ల్యూజే బృందం

అమరావతి, ఫిబ్రవరి 26: టీడీపీ అధినేత చంద్రబాబుతో (TDP Chief Chandrababu) ఏపీయూడబ్ల్యూజే (APUWJ) బృందం సోమవారం భేటీ అయ్యింది. జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టాలని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నేతలు కోరారు. టీడీపీ హయాంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పెట్టిన పలు పథకాలను జగన్ రద్దు చేశారని చంద్రబాబుకు జర్నలిస్తులు వివరించారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని నేతలు తెలిపారు. ఛలో అనంతపురాన్ని తాము విజయవంతం చేశామని కూడా చంద్రబాబుకు నేతలు చెప్పారు. తమ ఆందోళన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేశారన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకోబోయే చర్యలను మ్యానిఫెస్టోలో పెట్టాలని చంద్రబాబును ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కోరారు.

అంతకముందు జనసేన పొలిటికల్ ఎపైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కలిశారు. జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టాలని నేతలు కోరారు. చంద్రబాబు, మనోహర్‌ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే నేతలు ఐ.వి.సుబ్బారావు, సోమసుందర్, చందూ జనార్ధన్, చావా రవి, తదితరులు ఉన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 26 , 2024 | 04:40 PM