Share News

YS Sharmila: దేశంలో భారత రాజ్యాంగం నడవడం లేదు..

ABN , Publish Date - Mar 30 , 2024 | 07:39 PM

దేశంలో భారత రాజ్యాంగం నడవలేదని.. బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శనివారం ఆమె విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

YS Sharmila: దేశంలో భారత రాజ్యాంగం నడవడం లేదు..

విజయవాడ: దేశంలో భారత రాజ్యాంగం నడవలేదని.. బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శనివారం ఆమె విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బలపడకూదని, కాంగ్రెస్ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదని కోరుకుంటోందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీపై ఐటీ దాడి చేయించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అధికారులు బీజేపీ తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపిచారు. ఏపీకి బీజేపీ ఏమీ చేయకపోయినా.. చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ ఎందుకు కృషి చేయలేదని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె నిలదీశారు.

Updated Date - Mar 30 , 2024 | 07:42 PM