Share News

YS Sharmila: ఆర్కేపై షర్మిల వ్యాఖ్యలు.. ఎలా అర్ధం చేసుకోవాలో మరి!

ABN , Publish Date - Feb 23 , 2024 | 11:17 AM

Andhrapradesh: వైఎస్సార్సీపీ ఇంచార్జిల మార్పుల్లో టికెట్ కోల్పోయి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే తిరిగి సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్కే కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఏసీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తొలిసారి స్పందించారు.

YS Sharmila: ఆర్కేపై షర్మిల వ్యాఖ్యలు.. ఎలా అర్ధం చేసుకోవాలో మరి!

విజయవాడ, ఫిబ్రవరి 23: వైఎస్సార్సీపీ (YSRCP) ఇంచార్జిల మార్పుల్లో టికెట్ కోల్పోయి కాంగ్రెస్‌లో (Congress) చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Mangalagiri MLA Alla Ramakrishna reddy) ఇటీవలే తిరిగి సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్కే కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఏసీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) తొలిసారి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఆర్.కే అన్నతో నాకు ఉన్న అనుబంధం వేరు. ఆయన ఎన్ని ఒత్తిడులు ఉంటే పార్టీ మారారో నాకు తెలుసు. హీ రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ ప్లేస్. రామకృష్ణకు నాకు రాజకీయాలు లేవు.. నా మనస్సుకి దగ్గరైన వ్యక్తి రామకృష్ణ.. రాజకీయంగా కారణాలు లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి. వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని చెప్పే అవసరం నాకు లేదు’’ అని షర్మిల చెప్పుకొచ్చారు.

సొంతగూటికి...

కాగా.. ఈనెల 20న ఎమ్మెల్యే ఆర్కే తిరిగి సొంతగూటికి (వైఎస్సార్సీపి) చేరిన విషయం తెలిసిందే. ఆళ్ల సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్‌ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నెలరోజులకే ఆళ్ల తిరిగి సొంతగూటికి చేరడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన అనంతరం ఆర్కే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ మారుతున్నట్టు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి చెప్పలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి జగన్ ఓడించాలని చూస్తున్నాయని ఆర్కే అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 23 , 2024 | 11:42 AM