Share News

AP Govt: కక్ష కట్టిన జగన్ సర్కార్.. రాజధాని అమరావతిపై మరో భారీ కుట్ర

ABN , Publish Date - Mar 14 , 2024 | 10:52 AM

Andhrapradesh: రాజధాని అమరావతిపై జగన్ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరలేపింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజులు ముందు భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరుకు గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌ రద్దుతో రాజధాని మాస్టర్ ప్లాన్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 21 రెవెన్యూ గ్రామాల్లో 625 ఎకరాల సేకరణ పరిధి నుంచి మినహాయింపు రానుంది.

AP Govt:  కక్ష కట్టిన జగన్ సర్కార్.. రాజధాని అమరావతిపై మరో భారీ కుట్ర

అమరావతి, మార్రి 14: రాజధాని అమరావతిపై (Capital Amaravathi) జగన్ ప్రభుత్వం (Jagan Government) మరో భారీ కుట్రకు తెరలేపింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజులు ముందు భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరుకు గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌ రద్దుతో రాజధాని మాస్టర్ ప్లాన్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 21 రెవెన్యూ గ్రామాల్లో 625 ఎకరాల సేకరణ పరిధి నుంచి మినహాయింపు రానుంది. భూసమీకరణకు ఇచ్చిన భూముల మధ్య ఉన్న సమీకరణాలు ఇవ్వని రైతుల భూములను సేకరించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం (TDP Government) భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. సేకరణ తుది దశకు వచ్చిన తరుణంలో ప్రభుత్వం మారింది.

Marriage Video: పెళ్లి వేదికపై షాకింగ్ ఘటన.. అతిథులంతా ఒక్కసారిగా వధువుపై పడడంతో.. చివరకు..


వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) వచ్చిన తరువాత ఈ నోటిఫికేషన్‌పై గుట్టు చప్పుడు కాకుండా ఫైళ్లు కదిపిన అధికారులు.. చివరకు నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ప్రభుత్వం నిర్ణయంపై రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను విధ్వంసానికి కుట్ర పన్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం రాదు అనే ఉద్దేశ్యంతోనే ఈ కుట్ర చేశారని రైతులు ఆరోపించారు. దీనిపై రేపో మాపో హైకోర్ట్‌కు వెళ్ళాలని రాజధాని రైతులు నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి..

CM Jagan: అమ్మో సీఎం పర్యటనా!.. హడలెత్తిపోతున్న బనగానపల్లె ప్రజలు

Hyderabad: కార్పొరేటర్‌పై మహిళల దాడి.. నలుగురిపై కేసు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 14 , 2024 | 11:24 AM