Share News

ELECTIONS STORY : మేం నమ్మం జగన..!

ABN , Publish Date - May 08 , 2024 | 12:20 AM

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కసిగా మార్చుకొని ఓటుతో బుద్ధి చెప్పేందుకు జిల్లా ప్రజానీకం సమాయత్తమవుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయానికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారు. ‘మా నమ్మకం నువ్వే జగన’ నుంచి.. ‘నిన్ను నమ్మం జగన’ అనే పరిస్థితికి వచ్చారు. అడిగినందుకు ఒక్క చాన్స ఇచ్చామని.. ఐదేళ్లలో జిల్లాకు ఏం వెలగబెట్టారని ప్రశ్నిస్తున్నారు. పేరూరు, ..

ELECTIONS STORY : మేం నమ్మం జగన..!

వైసీపీకి అన్ని వర్గాలు దూరం

తేలిపోయిన ‘మా నమ్మకం నువ్వే జగన’

సీఎం బేల మాటలతో వైసీపీ అభ్యర్థుల్లో నైరాశ్యం

కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధమౌతున్న జనం

అనంతపురం, మే 7(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కసిగా మార్చుకొని ఓటుతో బుద్ధి చెప్పేందుకు జిల్లా ప్రజానీకం సమాయత్తమవుతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయానికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారు. ‘మా నమ్మకం నువ్వే జగన’ నుంచి.. ‘నిన్ను నమ్మం జగన’ అనే పరిస్థితికి వచ్చారు. అడిగినందుకు ఒక్క చాన్స ఇచ్చామని.. ఐదేళ్లలో జిల్లాకు ఏం వెలగబెట్టారని ప్రశ్నిస్తున్నారు. పేరూరు, భైరవానతిప్ప ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణాజలాలు ఇచ్చారా..? హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరిచ్చారా...? హెచఎల్సీని ఆధునికీకరించారా..? ఒక్క పరిశ్రమనైనా తెచ్చి.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారా..? చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి ప్రయోజనాలు చేకూర్చారా..? నా ఎస్సీ... నా బీసీ... నా ఎస్టీ... నా మైనార్టీ అని చెప్పుకోవడమే తప్ప.. ఆ వర్గాల కోసం ఏర్పాటు చేసిన


కార్పొరేషన్లకు ఒక్క పైసా నిధులు విదిల్చారా..? ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లానను అమలుపరిచి బడుగు వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారా..? ముస్లింలకు టీడీపీ హయాంలో అమలు చేసిన దుల్హాన, రంజాన తోఫా తదితర పథకాలు ఇచ్చారా..? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. బీఏఎస్‌ పథకం రద్దు చేసి పేద పిల్లల జీవితాలతో ఆడుకుంది వాస్తవం కాదా...? అన్న క్యాంటిన్లను ఎత్తేసి పేదల నోటికాడ ముద్ద తీసింది వాస్తవం కాదా..? డ్రిప్‌, స్ర్పింక్లర్లపై సబ్సిడీ ఎత్తేసి రైతులను ముంచలేదా..? బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల పథకాలను రద్దుచేసి.. ఆ వర్గాల బతుకులను చీకట్లోకి నెట్టింది మీరు కాదా అని నిలదీస్తున్నారు. జిల్లా అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడుతున్నారు.

వైసీపీ అభ్యర్థుల్లో అడుగంటిన ఆశలు

వైసీపీ మేనిఫెస్టో ఆ పార్టీ అభ్యర్థుల ఆశలను ఆవిరి చేసింది. వారు అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తరుణంలో జగన ప్రసంగంలో బేలమాటలు వస్తున్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థులు గెలుపుపై ఆశలు వదులుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దేనికైనా సిద్ధమన్న నోటితో జగన బేలమాటలు మాట్లాడటం ఆ పార్టీ అభ్యర్థులను మరింత నైరాశ్యంతోకి నెట్టింది. ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోందని సీఎం జగన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లోనేకాకుండా ఆ పార్టీ అభ్యర్థుల్లోనూ తీవ్రస్థాయిలో చర్చకు తెరలేపింది. వై నాట్‌ 175 అనే


నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జగన స్వరం.. రేపల్లె, మాచర్ల, బందరు సభల చిన్నబోయింది. ఇది అభ్యర్థులను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఏడెనిమిది నెలల క్రితం బటన నొక్కిన సొమ్మును పోలింగ్‌కు వారం రోజులు ముందు విడుదల చేయాలని భావించారు. అయితే ఎన్నికల కమిషన ఆ సొమ్ము విడుదలకు అంగీకరించలేదు. దీన్ని సాకుగా చూపి ఓట్లు దండుకునేందుకు జగన చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఏడు నెలల క్రితం పంట నష్టపోయిన రైతాంగానికి ఇనపుట్‌ సబ్సిడీ సొమ్ము ఎప్పుడు విడుదల చేయకూడదు..? పోలింగ్‌కు ఐదు రోజుల ముందు విడుదల చేయాలా..? ఇది ఓటర్లను ప్రలోభ పెట్టడం కాక మరేమిటి..? అని అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

కూటమికే పట్టం..

‘మీ బిడ్డ పాలన.. చంద్రబాబు పాలనలో జరిగిన తేడాను గమనించే ఓటు వేయండి’ అని సీఎం జగన బటన నొక్కుడు సభల్లోనూ, సిద్ధం సభల్లోనూ, మేమంతా సిద్ధం సభల్లోనూ పదే పదే చెబుతున్నారు. ఇదే ఆ పార్టీ అభ్యర్థులకు శాపంగా మారుతోంది. తేడాను గమనించామని, అందుకే ఎక్కువ మేలు చేసిన టీడీపీ కూటమి వైపే ఉంటామని అంటున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులు, యువత, కార్మికులు, రైతులకు ఆశించిన స్థాయిలో మేలు జరగలేదు. పరిశ్రమలు తీసుకురాలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇసుక అక్రమ రవాణాతో నిర్మాణంరంగ కార్మికులు


ఉపాధి కోల్పోయారు. ఉద్యోగులకు గత ప్రభుత్వంలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. వైసీపీ పాలనలో జీతాలే సరిగా ఇవ్వలేదు. రైతులకు పెట్టుబడి సాయం మినహా.. ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు. వైసీపీ పాలన కంటే.. గతంలో టీడీపీ కూటమి పాలనలోనే మేలు జరిగిందని అన్ని వర్గాలు అంటున్నాయి. అందుకే కూటమికే పట్టం కట్టాలనే నిర్ణయానికి జనం వచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కొనుగోలుకు అధికార పార్టీవారు ప్రయత్నించినా.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తిరస్కరించడం దీనికి నిదర్శనం.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 08 , 2024 | 12:20 AM