Share News

YOUTH : ఉడుకు నెత్తురు ఉప్పెనైతే..

ABN , Publish Date - May 03 , 2024 | 01:22 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చొరవ చూపలేదు. ప్రతి ఏడాదీ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్‌ జగన నిలబెట్టుకోలేదు. కరువు జిల్లా అనంతలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. యువత పొట్టచేతపట్టుకొని వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బటన నొక్కి.. అంతా చేసేశామనే భ్రమలో జగన ఉన్నారని యువత మండిపడుతోంది. తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత.. ఈ ఎన్నికల్లో కీలక ...

YOUTH : ఉడుకు నెత్తురు ఉప్పెనైతే..

ఎన్నికల్లో వైసీపీ గల్లంతు ఖాయం

నోటిఫికేషనలు లేక పెరిగిన నిరుద్యోగిత

పోటీ పరీక్షలకు సిద్ధమైనవారిలో నైరాశ్యం

ఎన్నికల్లో జగనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధం

వైసీపీ అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న యువత

వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చొరవ చూపలేదు. ప్రతి ఏడాదీ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం వైఎస్‌ జగన నిలబెట్టుకోలేదు. కరువు జిల్లా అనంతలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. యువత పొట్టచేతపట్టుకొని వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బటన నొక్కి.. అంతా చేసేశామనే భ్రమలో జగన ఉన్నారని యువత మండిపడుతోంది. తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత.. ఈ ఎన్నికల్లో కీలక తీర్పునిచ్చేందుకు సిద్ధమౌతోంది.

- ఆంధ్రజ్యోతి, అనంతపురం/సెంట్రల్‌


టీడీపీ భరోసా

టీడీపీ కూటమి విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను హామీగా ఇచ్చారు. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడమే కాకుండా... ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. కూటమి తరఫున టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేంత వరకు ఒక్కొక్కరికి నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించారు. ఈ హామీ పట్ల యువతలో ఆసక్తి కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే తాము ఉద్యోగాలు పొందుతామన్న విశ్వాసం వారిలో వ్యక్తమౌతోంది.

యువతే.. భవిత

జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో యువ ఓటర్ల సంఖ్య భారీగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 20.18 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 9,56,870 మంది యువ ఓటర్లు ఉన్నారు. ఇందులో తొలిసారిగా ఓటు వేయనున్నవారు 49,234 మంది ఉన్నారు. దాదాపు 48 శాతం మంది యువత ఓటర్ల తీర్పు ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. వైసీపీ ఐదేళ్ల పాలనపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యువత తోపాటు తొలి సారి ఓటు హక్కు వినియోగించుకోనన్నవారు సైతం వైసీపీ అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్నారు.


వైసీపీ అభ్యర్థుల్లో దడ

టీడీపీ కూటమి మేనిఫెస్టోలో యువతకు భరోసా కల్పించారు. వైసీపీ మేనిఫెస్టోలో మరోమారు బటన నొక్కుడు అంశాలు తప్ప వేరే కనిపించలేదు. దీంతో అధికార పార్టీ అభ్యర్థులు డీలా పడ్డారు. గడిచిన ఐదేళ్లలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవీ చేసింది లేదు. జిల్లాలో యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరందరూ తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న గుబులు వైసీపీ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. టీడీపీ హయాంలో... జిల్లాకు కియ పరిశ్రమ వచ్చింది. ప్రత్యక్షంగా 8 వేల మందికి, పరోక్షంగా మరో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. ఇలాంటి పని ఐదళ్లలో వైసీపీ ఒక్కటీ చేయలేదు.

ఎంత కష్టం..

జగన పాలనలో అత్యధికంగా నష్టపోయింది నిరుద్యోగులే. ఉద్యోగం సాధించి కుటుంబానికి బాసటగా నిలవాలని ఎంతో మంది తపించారు. రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. అందుకు ఊళ్లను వదిలి పట్టణాల్లో గదులను అద్దెకు తీసుకుని యజ్ఞం చేశారు. మూడు పూటలా తినడానికి లేక.. గుళ్లో ప్రసాదాలనే భోజనాలుగా సరిపెట్టుకున్నారు. ఎంతకాలం ఎదురుచూసినా నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో నిరుద్యోగుల ఓట్ల కోసం వైసీపీ ప్రభు త్వం అరకొరగా కానిస్టేబుల్‌, ఉపాధ్యాయ, వర్సిటీ టీచింగ్‌ పోస్టులకు నోటిఫికేషన విడుదల చేసింది. వాటిని కూడా భర్తీచేయకుండా కోర్టుల్లో కేసులు వేయించి, న్యాయస్థానాలపై నెపం నెట్టేసి చేతులు దులుపుకుందని నిరుద్యోగ యువత మండిపడుతోంది.


అంతా మోసం..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుభద్రుల ఓట్లు దండుకోవాలన్న దురుద్దేశంతో సీఎం జగన.. కానిస్టేబుల్‌ నోటిఫికేషన విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఈవెంట్స్‌, ఆ తర్వాత మెయిన ఎగ్జామ్స్‌ను నిర్వహించాలి. కానీ కోర్టు కేసులతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. 1,979 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు, 960 అసోసియేట్‌ ప్రొఫెసర్‌లు, 541 ప్రొఫెసర్‌లు.. మొత్తం 3,480 పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు గతేడాది అక్టోబరులో నోటిఫికేషన విడుదల చేశారు. నియామక సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ఏ అటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుని నోటిఫికేషన విడుదల చేయాలి. కానీ నోటిఫికేషన తప్పులతడకగా రూపొందించారు. దీనిపై కొంతమందితో కోర్టులో ప్రభుత్వమే కేసులు వేయించిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాలివ్వాలన్న ఉద్దేశం జగనకు లేనందుకే నోటిఫికేషనలు పారదర్శకంగా విడుదలచేయలేదని, కేవలం ఉద్యోగాలను ఆశచూపి సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు కుతంత్రాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


జగన జాబ్‌ పోతుంది..

ముఖ్యమంత్రి జాబ్‌ నుంచి జగనను తొలగించేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి యేటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పడంతో యువత మోసపోయారు. నోటిఫికేషనలు వస్తాయి, ఉద్యోగాన్ని కొడుతామని నిరుద్యోగులు ఐదేళ్లు ఎదురుచూశారు. సొంత ఊళ్లను వదిలి పట్ణణాల్లో అద్దె గదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కష్టపడి పనిచేస్తూ అద్దెలు, పుస్తకాలకు డబ్బులు కట్టారు. వారి కష్టం వృథా అయ్యింది.

- రమణయ్య, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

ఉద్యోగాలు ఏవీ..?

ప్రజలను, యువతను మాయమాటలతో మోసంచేసే వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగాలివ్వడం చేతకాదు. ఈ ఎన్నికల్లో మళ్లీమోసం చేసేందుకు డీఎస్సీ, కానిస్టేబుల్‌, యూనివర్సిటీ ఉద్యోగాలంటూ పారదర్శకతలేని నోటిఫికేషనలు ఇచ్చారు. వీటిపై జగనే పరోక్షంగా కోర్టుల్లో దావా వేయించి నిలుపుదల చేయించారు. న్యాయస్థానాలపై బురదజల్లుతున్నారు. ఐదేళ్ల పాలనలో ఉద్యోగాలు భర్తీచేయని అసమర్థుడిగా సీఎంగా జగన చరిత్రలో నిలిచిపోయారు.

- తరిమెల గిరి, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - May 03 , 2024 | 01:22 AM