KTR: ప్రధాని మోదీ ఆయనకు దోచిపెడుతున్నారు: కేటీఆర్

ABN , First Publish Date - 2023-03-08T16:57:14+05:30 IST

ప్రధాని మోదీ (PM Modi)పై మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు.

KTR: ప్రధాని మోదీ ఆయనకు దోచిపెడుతున్నారు: కేటీఆర్

మహబూబాబాద్: ప్రధాని మోదీ (PM Modi)పై మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. తమతో పాటే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ (Telangana)లో ఏవర్గానికి ఏం చేసింది? అని ప్రశ్నించారు. ఇవాళ తొర్రూరులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడరు. అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మతపరమైన మంటలు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రియమైన ప్రధాని కాదు...పిరమైన ప్రధాని అని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవన్నారు. 1550 కోట్ల రూపాయలను మహిళా రుణాలను ఇవాళ ఇస్తున్నామని తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడారు. అందుకే మన రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాడు గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉంది...ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించండని సూచించారు. 65 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లు చేయలేని పనులు ఇప్పుడు చేస్తున్నామన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు కేటీఆర్ ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakar Rzao) అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడని కొనియాడారు. ఎర్రబెల్లి దయాకర్‌రావును కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సిరిసిల్ల కంటే పాలకుర్తిలో దయాకర్‌రావును ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-08T16:57:14+05:30 IST