Share News

Damodar Raja Narasimha: మంత్రిగా ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం.. గతంలో నిర్వర్తించిన శాఖలు ఇవే!

ABN , First Publish Date - 2023-12-07T14:09:34+05:30 IST

నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆయనతో ప్రమాణం చేయించారు.

Damodar Raja Narasimha: మంత్రిగా ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం.. గతంలో నిర్వర్తించిన శాఖలు ఇవే!

నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయన తెలుగులో కాకుండా ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో రాజనర్సింహ అందోల్ నియోకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 65 ఏళ్ల వయసు గల రాజనర్సింహకు సుదీర్ఘ రాజకీయన అనుభవం ఉంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కాంగ్రెస్‌లోనే రాజనర్సింహ పార్టీకి విశేషమైన సేవ చేశారు. గతంలోనూ మంత్రిగా కూడా పని చేశారు. ఆయన చేసిన సేవలను గర్తించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం మంత్రివర్గంలో చోటు కల్పించింది. కాగా గతంలోనూ మంత్రిగా పని చేసిన రాజనర్సింహకు విశేషమైన అనుభవం ఉంది.


1958 డిసెంబర్ 5న దామోదర రాజనర్సింహ జన్మించారు. ఇంజనీరింగ్ చదివిన రాజనర్సింహ 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాయకీయాల్లోకి అరంగేంట్రం చేశారు. 1989లో ఆందోల్ నియోజవర్గం నుంచి మొదటిసారిగా శాసనసభకు పోటీ చేశారు. మొదటిసారే శాసనసభ్యుడిగా విజయం సాధించారు. 2004లో మళ్లీ ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారిగా 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో చోటు లభించింది. వైఎస్సార్ మంత్రి వర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో ఆందోల్ నుంచి గెలుపొందిన దామోదర రాజనర్సింహ వైఎస్సార్, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో పని చేశారు. 2010 డిసెంబర్‌లో ఏర్పాటైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా ఆయనకు చోటు దక్కింది. 2011 జూన్ 10న ఉప ముఖ్యమంత్రి పదవి కూడా లభించింది. 2023 ఆగస్టు 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితులయ్యారు. కాగా రాజనర్సింహ తండ్రి సి. రాజనర్సింహ కూడా ఆందోల్ నుంచే 3 సార్లు శాసనసభకు

ఎన్నికయ్యారు.

Updated Date - 2023-12-07T14:33:06+05:30 IST