Share News

Raghunandan Rao: పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడాలి

ABN , First Publish Date - 2023-10-26T17:25:24+05:30 IST

పదేళ్ల బీఆర్ఎస్ ( BRS ) పాలనకు చరమ గీతం పాడా సమయం ఆసన్నమైందని బీజేపీ (BJP) పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao ) అన్నారు.

Raghunandan Rao: పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడాలి

సిద్దిపేట: పదేళ్ల బీఆర్ఎస్ ( BRS ) పాలనకు చరమ గీతం పాడా సమయం ఆసన్నమైందని బీజేపీ (BJP) పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) అన్నారు. గురువారం నాడు గజ్వేల్‌లో బీజేపీ పార్టీ విజయ శంఖారావం సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభలో మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు . ఈ సమావేశంలో ఈటల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి పెద్దఎత్తున పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నేతలకి ఈటల బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ...‘‘దసరా అయిపోయినా గొర్రెలు కోసి బీజేపీ మీటింగ్‌కు రాకుండా బీఆర్ఎస్ నేతలు ధావత్‌లు ఇస్తున్నారు. ఫాంహౌస్‌కు పరిమితం అయినా సీఎం కేసీఆర్‌ని గజ్వేల్ ప్రజలు ఓడిస్తారనే భయంతోనే కామారెడ్డికి పోతున్నాడు. గజ్వేల్‌లో పేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదు. గరిబోల్ల భూములు గుంజుకుని, సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుని అప్పటి కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ బిడ్డనే సీఎం అవుతారు. జనాభాలో 55 శాతం ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులు ఇస్తే, ఒక్క శాతం కూడా లేని సీఎం వర్గానికి 4 పదవులా ? ఆరడుగుల బుల్లెట్‌లో మందు అయిపోయింది.. ఖాళీ బుర్ర మిగిలింది. ఆ ఖాళీ బుర్రకు బుద్ది చెప్పాలి. బీజేపీ చెప్పిందే చేస్తది.. మోసం చేసుడు బీజేపీకి తెల్వదు. ఈటలను ఓడించడానికి హుజురాబాద్‌లో ఇంటికి 10 లక్షలు ఇచ్చిన కేసీఆర్, గజ్వేల్‌లో ఇచ్చాడా ? ఉర్లళ్లో చిన్నచిన్న వాటికి పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు అంటే మాకు విభేదాలు లేవు. పైసల మంత్రి పైసల సూట్ కేసులతో వస్తాడు.. జాగ్రత్త. 10 వేల కోట్ల లిక్కర్ ఆదాయాన్ని 50 వేల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ ది. గజ్వేల్‌లో కారు పంచర్.. కమల వికాసం ఖాయం’’ అని రఘునందన్‌రావు జోస్యం చెప్పారు.

Updated Date - 2023-10-26T17:25:24+05:30 IST