Share News

Raghunandan Rao : బీజేపీపై హరీష్‌రావు దుష్ప్రచారం

ABN , First Publish Date - 2023-10-20T17:02:59+05:30 IST

దుబ్బాక ( Dabbaka ) కు నేనెప్పుడూ రుణపడి ఉంటానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌‌రావు ( BJP MLA Raghunandan Rao ) తెలిపారు. శుక్రవారం నాడు దుబ్బాకలో పర్యటించారు.

Raghunandan Rao : బీజేపీపై హరీష్‌రావు దుష్ప్రచారం

దుబ్బాక: దుబ్బాక ( Dabbaka ) కు నేనెప్పుడూ రుణపడి ఉంటానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌‌రావు ( BJP MLA Raghunandan Rao ) తెలిపారు. శుక్రవారం నాడు దుబ్బాకలో పర్యటించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దుబ్బాకలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించాం. బీజేపీపై మంత్రి హరీష్‌రావు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్క కొలువు ఇవ్వలేదు.. కానీ కేసీఆర్‌ ఇంట్లో అందరికీ కొలువులే ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్‌లో చేరడం ఖాయం. తెలంగాణలో మంచి కోసం, మార్పు కోసం.. బీజేపీకి ఒక్క అవకాశమివ్వాలి’’ అని రఘునందన్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-20T17:02:59+05:30 IST