Share News

Etala Rajender: తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏమిటో ఇక్కడి ప్రజలకు తెలుసు

ABN , First Publish Date - 2023-10-26T18:56:40+05:30 IST

2014 వరకు తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలుసునని మాజీమంత్రి, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.

Etala Rajender: తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏమిటో ఇక్కడి ప్రజలకు తెలుసు

గజ్వేల్: 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలుసునని మాజీమంత్రి, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు. గురువారం నాడు గజ్వేల్‌లో బీజేపీ పార్టీ విజయ శంఖారావం సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభలో మాజీమంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు . ఈ సమావేశంలో ఈటల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి పెద్దఎత్తున పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నేతలకి ఈటల బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ...‘‘ఈ ప్రాంతానికి నేను కొత్తకాదు.. 1992లో వర్గల్‌లో చిన్న కోళ్ల ఫాంతో జీవితాన్ని ప్రారంభించిన. 20 ఏళ్ల పాటు మీ కళ్ల ముందు పెరిగిన బిడ్డను నేను. 2015లో మొట్టమొదటి సమ్మె మున్సిపల్ కార్మికులు చేస్తే 1700 మంది కార్మికులను ఒక్క సంతకంతో తొలగించిన చరిత్ర ఈ సర్కార్‌ది. ఈ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అసాధ్యం అన్న సీఎం కేసీఆర్‌కు ఈనాడు ఎలా సాధ్యం అయింది. నాకు నియోజకవర్గం లేక గజ్వేల్‌కు రాలేదు. 20 ఏళ్లు కేసీఆర్ నాతో పని చేయించుకుని మెడలుబట్టి వెళ్లగొడితే.. హుజురాబాద్ గడ్డ నన్ను గెలిపించింది. 2009లో 50 మందికి బీఫాం ఇస్తే పట్టుమని 10 మంది గెలువలేదని దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నాడు. రోశం ఉన్నోడే కొట్లాడుతాడు.. అందుకే నేను రాజీనామా చేశా. ఈరోజు గజ్వేల్‌లో నా మీటింగ్‌కు పోవద్దని.. అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు ధావత్‌లు ఇచ్చారు’’ అని ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-26T18:57:07+05:30 IST