Share News

Gangula Kamalakar : కరీంనగర్‌లో మీ అభ్యర్థులేరీ రాహుల్

ABN , First Publish Date - 2023-10-20T18:30:42+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులేరీ అని కాంగ్రెస్ అగ్రేత రాహుల్‌గాంధీని మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) ప్రశ్నించారు.

 Gangula Kamalakar : కరీంనగర్‌లో మీ అభ్యర్థులేరీ రాహుల్

కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులేరీ అని కాంగ్రెస్ అగ్రేత రాహుల్‌గాంధీని మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar ) ప్రశ్నించారు. శుక్రవారం నాడు కరీంనగర్‌లో గంగుల కమలాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘‘ కరీంనగర్ లో మీ నానమ్మ ఐలాండ్ చూసి వెళ్తే బాగుండు రాహుల్... తెలంగాణ ఎంత అభివృద్ధి అయ్యిందో నీకు తెలిసేది. జిల్లాలో పోటీ చేసే అభ్యర్థులేకుండా ఇదేం ప్రచారం. స్థానిక నేతలను అడిగి రాహుల్‌గాంధీ తెలుసుకోవాలి. జాతీయ పార్టీలకు.. రాష్ట్రానికో విధానం ఉంటుందా’’...? అని గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

Updated Date - 2023-10-20T18:30:42+05:30 IST