TS NEWS: గచ్చిబౌలిలో జోరుగా ఈ సిగరేట్ల వినియోగం

ABN , First Publish Date - 2023-08-08T15:41:18+05:30 IST

నగరంలోని గచ్చిబౌలి(Gachibowli)లో నిషేదిత ఈ సిగరేట్ల( cigarettes are prohibited)ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు, పబ్‏లను టార్గెట్‏గా చేసుకుని నిషేదిత సిగరేట్లను ఓ ముఠా అమ్ముతోంది.

TS NEWS: గచ్చిబౌలిలో జోరుగా ఈ  సిగరేట్ల వినియోగం

హైదరాబాద్(Hyderabad): నగరంలోని గచ్చిబౌలి(Gachibowli)లో నిషేదిత ఈ సిగరేట్ల( cigarettes are prohibited)ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు, పబ్‏లను టార్గెట్‏గా చేసుకుని నిషేదిత సిగరేట్లను ఓ ముఠా అమ్ముతోంది. నిందితుల వద్ద నుంచి 2 లక్షల విలువ చేసే ఈ సిగరేట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‏కు తరలించారు.ఈ సిగరేట్లను అమ్మితే కఠిన చర్యలు తీసకుంటామని మాదాపూర్ డీసీపీ సందీప్‏రావు(Madapur DCP Sandeep Rao) హెచ్చరించారు. ఈ సందర్భంగా డీసీపీ సందీప్‏రావు మీడియాతో మాట్లాడారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ - సిగరెట్లను విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నాం.

ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ముఠాని పట్టుకున్నాం. ఈ గ్రూపులో మొత్తం పది మంది ఉన్నట్లు గుర్తించాం.ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.నిందితుల వద్ద నుంచి రెండు లక్షల రూపాయలు విలువ చేసే 99 డిస్పోసల్ ఈ - సిగరెట్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఈ-సిగరెట్లను 2019లో ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ సిగరెట్లు విక్రయించిన, కొనుగోలు చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని డీసీపీ సందీప్‏రావు హెచ్చరించారు.

Updated Date - 2023-08-08T15:41:43+05:30 IST