Share News

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2023-12-09T11:21:27+05:30 IST

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. నూతన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ (Protem Speaker Akbaruddin Owaisi) చేపట్టారు. నూతన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. ఆపై వరుసగా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో వీక్షించండి...


కాగా... 51 మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనారోగ్య కారణాల వల్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరుకాలేదు. అటు అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో 10 మంది సభ్యులు సభకు హాజరుకాలేదు. మొత్తం 109 మంది శాసనసభ్యులు సభకు హాజరయ్యారు. స్పీకర్ ఎన్నిక వరకు ప్రొటెం స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం బీఏసీ సమావేశం జరుగనుంది. స్పీకర్‌ ఎన్నికపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - 2023-12-09T13:37:15+05:30 IST