Raghuveera Reddy: తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది
ABN , First Publish Date - 2023-10-06T16:08:00+05:30 IST
తెలంగాణలో రోజు రోజుకూ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి(Raghuveera Reddy) వ్యాఖ్యానించారు.
శ్రీసత్యసాయిజిల్లా : తెలంగాణలో రోజు రోజుకూ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి(Raghuveera Reddy) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సత్యసాయి జిల్లాలోని మడకశిరలో పర్యటించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక మాదిరి తెలంగాణాలో ఆరు గ్యారంటీల కార్డు ఇంటింటికీ తీసుకెళ్తే...తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రజల్లోకి తీసుకెళ్తే గెలుపు సాధింస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో వందసార్లు పర్యటించినా....కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే నమ్మకం ఉంది. బీజేపీ, టీడీపీ, వైసీపీ దాగుడు మూతలతో పోలవరం ఆలస్యమవుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే...2019 నాటికే పోలవరం పూర్తి అయ్యేది. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ దేశానికి అవసరం.కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అవలంబించబోయే వ్యూహాలను ఈనెల 9వ తేదీన జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తాం’’ అని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.