RS Praveen Kumar : దొరల పాలనతో బహుజనులకు తీరని నష్టం

ABN , First Publish Date - 2023-08-23T16:58:49+05:30 IST

దొరల పాలనతో బహుజనులకు తీరని నష్టం జరుగుతోందని తెలంగాణ బహుజన సమాజ్ వాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ (Praveen Kumar)అన్నారు.

RS Praveen Kumar : దొరల పాలనతో బహుజనులకు తీరని నష్టం

హైదరాబాద్: దొరల పాలనతో బహుజనులకు తీరని నష్టం జరుగుతోందని తెలంగాణ బహుజన సమాజ్ వాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ (Praveen Kumar)అన్నారు. బుధవారం నాడు నర్సంపేటకు చెందిన మదన్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ(BRS party) నుంచి బహుజన సమాజ్ వాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..‘‘బహుజన సమాజ్ వాదీ పార్టీ(Bahujan Samajwadi Party) మరో విజయం సాధించింది. దొరల పార్టీ నుంచి, దొరల జెండా మోస్తూ చాకిరి చేసిన బహుజనుడు బహుజనుల పార్టీకి రావడం సంతోషం. ఒక శాతం ఉన్న అగ్రవర్ణాల అధికారాన్ని చేపడుతుంటే..90శాతం ఉన్న బహుజనులు ఏం చేయాలని ప్రశ్నించారు. బీసీ వర్గాల నుంచి 150కులాలు ఉంటే 6కులాలకే టికెట్లు ఇచ్చి..23సీట్లు మాత్రమే సీఎం కేసీఆర్‌ ఇచ్చారు. బహుజనులు మన బతుకుల బాగుకోసం మనం ఆలోచించాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ(Telangana)లో మళ్లీ దొరల పాలన వల్ల బహుజనులు నష్టపోతున్నాం. 99శాతం ఉన్న మన కోసం మన పార్టీ బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది.. మనం అందరం ఒక తాటిపైకి రావాలి. వంద కోట్ల లిక్కర్ స్కామ్‌లో నిందితురాలు అయిన ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha(ను ముట్టుకోవడానికి భయపడుతున్నారు. అదే బహుజన గిరిజన బంజారా లక్ష్మీ భాయ్‌(Banjara Lakshmi Bhai)ను చిత్రహింసలకు గురిచేస్తే ఎవరు మాట్లాడరు.డాక్టర్ తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah)కు టికెట్ రాకపోతే అంబేడ్కర్ విగ్రహం వద్ద వలవల ఎడుస్తున్నారు.. ఆయనకు అంబేడ్కర్ ఏం చెప్పిండో తెలియదా? అంబెడ్కర్.. ఆత్మ గౌరవంతో బోధించు, సమీకరించు, ఆశించు అని జీవించమన్నారు. రాజయ్య.. మీరు అలా ఏడవద్దు. ఎలక్షన్ ఓట్ల కోసమే రైతు రుణ మాఫీ, లాంటి బిస్కెట్లు వేసి కేసీఆర్ ఆకట్టుకుంటున్నారూ. అది నమ్మకండి’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌(BJP, Congress, BRS)లో ఉన్న బహుజనులారా బహుజన సమాజ్ వాజ్ పార్టీలోకి రండి అందరం ఏకం అవుదాం.. మా పార్టీ ఎప్పుడు మీకు స్వాగతం పలుకుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ‘‘బీజేపీతో బీఆర్ఎస్‌ రహస్యంగా ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 50కోట్ల వరకు పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. బహుజనులు ఓట్ల కోసం ఇతర పార్టీవాళ్లు ఇచ్చే తాయిలాలకు ఆశపడొద్దు. కేసీఆర్ ఇప్పటికే ఒడినట్లు ఒప్పుకొని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇంటిలిజెన్స్‌లను అడ్డుపెట్టుకొని సర్వేలు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిన కేసీఆర్‌ను మళ్లీ ఎన్నుకుంటే రాష్ట్రం ఆగం ఐతది. అగమేగలమీద లిక్కర్ టెండర్లు వేస్తున్నాడు. డిసెంబర్ వరకు సమయం ఉన్న ఇప్పుడే ఎందుకు వేలం వేస్తున్నారంటే .. ఆ డబ్బులు ఎలక్షన్స్ ఫండ్ కోసమే. సిగ్గులేకుండా రిజర్వేషన్లపై సీట్లు పొందిన వారు వెంటనే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి రావాలి. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూమి వేలం వేసుకొని డబ్బులు దన్నుకుంటున్నారు. విలేకరులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. జర్నలిస్టులకు బహుజనుల సమాజ్ వాజ్ పార్టీ మద్దతుగా ఉంటుంది’’ అని బీఎస్సీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2023-08-23T16:58:49+05:30 IST