Share News

TS NEWS: జీవో 86పై హైకోర్టులో పిటీషన్

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:42 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) వైన్స్ షాప్‌పై జారీ చేసిన జీవో 86‌ను సవాలు చేస్తూ హైకోర్టు‌లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ని భూక్యా దేవానాయక్ దాఖలు చేశారు. జీవో 86 ప్రకారం గిరిజనులకు 5 శాతం వైన్స్ కేటాయించక పోవడంతో పిటిషనర్ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

TS NEWS: జీవో 86పై హైకోర్టులో పిటీషన్

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) వైన్స్ షాప్‌పై జారీ చేసిన జీవో 86‌ను సవాలు చేస్తూ హైకోర్టు‌లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ని భూక్యా దేవానాయక్ దాఖలు చేశారు. జీవో 86 ప్రకారం గిరిజనులకు 5 శాతం వైన్స్ కేటాయించక పోవడంతో పిటిషనర్ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ, గిరిజన శాఖ, చీఫ్ సెక్రటరీ‌కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయని పక్షంలో జీవో 86 రద్దుపై ఆలోచిస్తామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - Dec 26 , 2023 | 03:42 PM