Share News

BJP: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రంలో స్పష్టత లేదు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

ABN , Publish Date - Dec 22 , 2023 | 06:45 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) అసెంబ్లీ పెట్టిన శ్వేతపత్రంలో స్పష్టత లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ( MLA Payal Shankar ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు చర్చ జరపలేదు. గతంలో మా దగ్గర సాక్షాలు ఉన్నాయని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. విచారణకు ఫిర్యాదు చేద్దామంటే సరైన సహకారం అందలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారు.

BJP: కాంగ్రెస్ ప్రభుత్వం  అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రంలో స్పష్టత లేదు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) అసెంబ్లీ పెట్టిన శ్వేతపత్రంలో స్పష్టత లేదని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ( MLA Payal Shankar ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు చర్చ జరపలేదు. గతంలో మా దగ్గర సాక్షాలు ఉన్నాయని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. విచారణకు ఫిర్యాదు చేద్దామంటే సరైన సహకారం అందలేదన్నారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్లదే కదా.. అయినా ఎందుకు చర్చించలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేంద్రానికి సీబీఐ ఎంక్వయిరీ కోసం కాంగ్రెస్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. మా కంటే ఒక సీటు తక్కువ ఉన్న ఎంఐఎం పార్టీ నేతల కంటే మాకు మాట్లాడేందుకు తక్కువ సమయం కేటాయించారని.. ఇదెక్కడి సంప్రదాయమని అసెంబ్లీ వ్యవహారాలు చూసుకునే వారిని ప్రశ్నించామన్నారు.మోటార్లకు మీటర్లు అని బీజేపీ పార్టీని బదనాం చేయాలని చూశారని మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజం చెప్పారని.. ఆయనకు బీజేపీ తరుపున ధన్యవాదాలు తెలిపారు.మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నేతలకు సిగ్గు రావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.

6 గ్యారెంటీల్లో మిగిలిన వాటిని త్వరగా అమలు చేయాలి: సూర్యనారాయణ గుప్తా

కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో మిగిలిన త్వరగా అమలు చేయాలని బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ( MLA Dhanpal Suryanarayana Gupta ) తెలిపారు. శుక్రవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేసిందన్న విషయం కాంగ్రెస్‌కు కూడా తెలుసునని చెప్పారు.మహాలక్ష్మి స్కీమ్2లో ఒక్క ఫ్రీ బస్సు మాత్రమే ఇంప్లిమెంట్ చేశారన్నారు. మిగిలినవి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు మోదీ ఫొటోను పెట్టడం లేదన్నారు. అక్బరుద్దీన్ సమయం దొరికినప్పుడల్లా బీజేపీపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని మండిపడ్డారు. ఎంఐఎం మతతత్వ పార్టీ అని నిన్నటితో తేలిపోయిందని చెప్పారు. హిందువులంతా ఒకసారి ఆలోచన చేయాలని ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.

నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి: పైడి రాకేష్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం యువత, నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ( MLA Paidi Rakesh Reddy ) పేర్కొన్నారు. శుక్రవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ గ్యారెంటీలను అమలు చేయడం సాధ్యం కాదని ప్రజలను మానసికంగా ప్రిపేర్ చేయడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు, యువత మరోసారి అన్యాయం చెయొద్దని చెప్పారు. మెగా డీఎస్సీతో పాటు 2 లక్షల ఖాళీలు భర్తీ చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - Dec 22 , 2023 | 06:59 PM