Share News

Talasani Srinivas: పీసీసీ ప్రెసిడెంట్‌ ఓ మూర్ఖుడు

ABN , First Publish Date - 2023-11-11T15:48:04+05:30 IST

ఏఐసీసీ ఓ మూర్ఖుడిని పీసీసీ ప్రెసిడెంట్‌గా పెట్టుకుంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

Talasani Srinivas: పీసీసీ ప్రెసిడెంట్‌ ఓ మూర్ఖుడు

హైదరాబాద్: ఏఐసీసీ ఓ మూర్ఖుడిని పీసీసీ ప్రెసిడెంట్‌గా పెట్టుకుంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... పీసీసీ ప్రెసిడెంట్ చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. ఆయన భాషపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. గ్రేటర్‌లో 70వేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చామని.. రాని వారికి కూడా ఇస్తామని దైర్యంగా ఉండాలని సూచించారు. తాము గాలి మాటలు చెప్పమని.. తమ మీద నమ్మకం పెట్టాలని కోరారు. పాలకుర్తికి వెళ్లి దయాకర్ రావుపై (Dayakar rao) వల్గర్‌గా మాట్లాడారని మండిపడ్డారు. తన మీద కూడా వ్యక్తిగతంగా మాట్లాడారన్నారు. నోరు అదుపులో పెట్టుకోక పోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. గ్రేటర్‌లో కేటీఆర్ (KTR) రోడ్ షో 17నుంచి స్టార్ట్ అవుతుందని తెలిపారు. 25న కేసీఆర్ (CM KCR) బహిరంగ సభ ఉంటుందని మంత్రి అన్నారు.


కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను కర్ణాటక సీఎం సిద్దా రామయ్య (Karnataka CM Sidda Ramaiah) ప్రకటించారన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌లు ప్రకటించే నేతలు ఎవరూ ఇక్కడ ఉండేవారు కాదని.. రేపు బీసీలు ఎవరిని అడగాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను ప్రజలు నమ్మరన్నారు. డీకే శివకుమార్ (DK Shivakumar) వచ్చి అబాసుపాలయ్యారని వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అతిగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), హుజురాబాద్‌లో ఈటెల(Etela Rajender) ఇద్దరు ఓడిపోడుతున్నారని... అందుకే అధిష్టానంకు చెప్పుకోవడానికి సీఎం మీద ఓడిపోయాను అని చెప్పుకోవాలనే ఈ ప్రయత్నమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-11T15:51:05+05:30 IST