MIM MLAs: ‘కంటి వెలుగు’ అద్భుతమన్న ఎంఐఎం ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2023-02-08T12:33:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమంపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించారు.

MIM MLAs: ‘కంటి వెలుగు’ అద్భుతమన్న ఎంఐఎం ఎమ్మెల్యేలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమం (Kanti Velugu Programme)పై ఎంఐఎం ఎమ్మెల్యేలు (MIM MLAs) ప్రశంసలు కురిపించారు. బుధవారం ఉదయం ఎంఐఎం శాసన సభ్యులు అక్బరుద్దీన్ (Akbaruddin), పాషా ఖాద్రి (Pasha Qadri), ముంతాజ్ ఖాన్‌ (Mumtaz Khan)లను అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటివెలుగు స్టాల్‌ల వద్దకు ఆర్ధిక, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao)స్వయంగా తీసుకెళ్లారు. దగ్గరుండి మరీ ఎమ్మెల్యేలకు పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా కంటివెలుగు ప్రాముఖ్యతను ఎమ్మెల్యేలకు మంత్రి వివరించారు. కంటి వెలుగు కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా ఎంఐఎం శాసన సభ్యులు కొనియాడారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ది కలిగించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసనసభ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌ (CM KCR), మంత్రి హరీష్ రావు (Minister Harish Rao), ప్రభుత్వాన్ని (Telangana Government) ఎంఐఎం ఎమ్మెల్యేలు అభినందించారు.

Updated Date - 2023-02-08T12:33:35+05:30 IST