Share News

Kishan Reddy: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటమే కేసీఆర్ లక్ష్యం

ABN , First Publish Date - 2023-10-14T18:05:12+05:30 IST

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటమే కేసీఆర్ లక్ష్యమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు.

Kishan Reddy: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటమే కేసీఆర్ లక్ష్యం

హైదరాబాద్: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటమే కేసీఆర్ లక్ష్యమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. శనివారం నాడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సుల్లో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘ఓట్లపై తప్ప.. తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు. కేటీఆర్‌ను సీఎం చేయడానికి ఎన్నికల్లో కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాడు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేస్తోన్న సాయాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. కేంద్రం అప్పు ఇస్తేనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజక్టును పూర్తిచేశాడు. తెలంగాణలో 11ప్రాజెక్టులు పూర్తిచేయడానికి మోదీ సర్కార్ నిధులిచ్చింది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి కేసీఆర్ ఇష్ట పడడం లేదు. అనుసంధానం చేస్తే.. కాంట్రాక్టర్ల ద్వారా వేల కోట్ల రూపాయలు కమీషన్ రాదని కేసీఆర్ భయపడుతున్నాడు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా మార్చుకుంది.చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్, పేరు మార్చి.. కేసీఆర్ ఫాంహౌస్ ఇంజినీర్‌గా మారాడు. కాళేశ్వరం ప్రాజక్టు కరెంట్ బిల్లులు, నిర్వహణ భారం ప్రజల మీదనే పడుతుంది. పంటల బీమాతోనే రైతుకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ మినహా.. దేశమంతటా పంట బీమా అమలవుతుంది. బీజేపీ అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేసి రైతులకు న్యాయం చేస్తాం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటమే మోదీ ప్రభుత్వం లక్ష్యం.

బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకే కేసీఆర్.. ఎకరానికి కోటి సంపాదిస్తున్నానని చెప్తున్నాడు. రైతులు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. తెలంగాణలో రైతు రాజ్యాన్ని తీసుకొస్తాం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-14T18:05:12+05:30 IST