Kishan Reddy : తెలంగాణ అధ్యక్ష పదవీ నుంచి కిషన్‌రెడ్డి తప్పుకోనున్నారా..?
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:30 PM
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్ ( BL Santosh ) తో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీ అధ్యక్ష పదవీ నుంచి తొలగాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్ ( BL Santosh ) తో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీ అధ్యక్ష పదవీ నుంచి తొలగాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదే విషయంపై బీఎల్ సంతోష్‌తో కిషన్‌రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల వరకూ కిషన్‌రెడ్డినే కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధిష్ఠానం నిర్ణయాన్ని బీఎల్ సంతోష్ కిషన్‌రెడ్డికి చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు రాకపోవడంతో బీజేపీ క్యాడర్ కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన ఈ నిర్ణయాన్ని తెలపడం చర్చనీయాశంగా మారింది.
వారు పోటీకి అనర్హలు
మెదక్ జిల్లా :నర్సాపూర్‌లో మెదక్ పార్లమెంట్ బీజేపీ ముఖ్య నేతల రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసిన వారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి అనర్హులని ఖరాఖండిగా చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొత్తవారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.