Share News

TS Challan: గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై ఆఫర్

ABN , Publish Date - Dec 22 , 2023 | 03:42 PM

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. పెండింగ్ చలాన్ల ( Pending Challans )పై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు తెలంగాణ పోలీసుశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లను త్వరగా చెల్లించేందుకు వాహనదారులకు రాష్ట్ర పోలీసులు బారీ రాయితీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

TS Challan: గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై ఆఫర్

హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt ) మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. పెండింగ్ చలాన్ల ( Pending Challans )పై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు తెలంగాణ పోలీసుశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లను త్వరగా చెల్లించేందుకు వాహనదారులకు రాష్ట్ర పోలీసులు బారీ రాయితీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు డిస్కౌంట్‌తో కట్టవచ్చని తెలిపింది. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్, టూవీలర్ చలాన్లకు 80 శాతం డిస్కౌంట్, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్‌ ఇచ్చారు. ఆన్‌లైన్‌తో పాటు మీసేవ సెంటర్స్‌లో డిస్కౌంట్‌లో చలాన్స్ పేమెంట్ చేసే అవకాశాన్ని పోలీస్ శాఖ కల్పించింది. 2022లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 300 కోట్ల చలాన్స్ వసూలు అయ్యాయి. ఆ తర్వాత జనరేట్ అయిన చలాన్లకు డబ్బులు సరిగా వసూలు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. చలాన్లు భారీగా పెరిగిపోతుండడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 22 , 2023 | 11:18 PM