Akbaruddin: రేవంత్‌రెడ్డిపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-29T22:29:15+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చంద్రయాణాగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(MLA Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Akbaruddin: రేవంత్‌రెడ్డిపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చంద్రయాణాగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(MLA Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ వారు మేము బీజేపీకి " బి "టీం అంటున్నారు. మరీ.. సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి. అలాగే రేవంత్‌రెడ్డి మొదటగా RSS కార్యకర్తగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పనిచేస్తున్నారు. మీతో ఏదైతే అది చేసుకోండి. రాష్టంలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నామేము చెప్పినట్లే నడవాలి, వినాలి. లేకపోతే తమ ప్రతాపం చూపిస్తాం’’ అని అక్బరుద్దీన్ హెచ్చరించారు.

Updated Date - 2023-09-29T22:29:15+05:30 IST