Share News

YS Sharmila: ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన

ABN , First Publish Date - 2023-11-24T16:59:27+05:30 IST

ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎద్దేవ చేశారు.

YS Sharmila:   ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన

హైదరాబాద్: ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎద్దేవ చేశారు. శుక్రవారం నాడు షర్మిల మీడియాతో మాట్లాడుతూ..‘‘కేటీఆర్​.. తెలంగాణలో పదేళ్లుగా సాగింది సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి కాదు.. "అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన". 5 లక్షల కోట్లు అప్పులు చేసి, ఒక్కోక్కరి నెత్తిమీద 2 లక్షల అప్పు మోపారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడానికి సిగ్గుండాలి. దేశంలో ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం నెంబర్ 1 ఉంటే.. నిరుద్యోగులు 50 లక్షల మంది ఎందుకున్నట్లు? ఉద్యోగాలిస్తే వందలాది మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు’’ అని వైఎస్ షర్మిల ష్రశ్నించారు.

పదేళ్లలో 65 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు

‘‘పదేళ్లలో పట్టుమని 65 వేల ఉద్యోగాలు ఇవ్వడం మీకు చేతకాలేదు. ఇంటికో ఉద్యోగం ఇచ్చినట్లు, నిరుద్యోగులను ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. బహిరంగ చర్చకు రావాలి అని సవాల్ విసురుతున్న మీ తీరుకు నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. మీ దరిద్రపు పాలనలో టీఎస్పీఎస్సీ లీకుల బాగోతం దేశమంతా ఎరుకే.ఇంకా నిరుద్యోగులు మిమ్మల్ని నమ్ముతారని కల్లబొల్లి కబుర్లు చెప్పడం మీ అవివేకానికి నిదర్శనం’’ అని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-24T16:59:28+05:30 IST