Share News

RS Praveen Kumar : ఈ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం

ABN , First Publish Date - 2023-11-17T18:18:38+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం.. ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) ప్రశ్నించారు.

RS Praveen Kumar : ఈ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం

నాగర్ కర్నూల్ జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం.. ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) ప్రశ్నించారు. శుక్రవారం నాడు బీఎస్పీ పార్టీ రాజ్యాధికార సభ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సభలో ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ... ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో 1,50,000 కోట్లు గోదావరి పాలయ్యాయి. ఉద్యోగులు, పోలీసులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీ రాజ్యంలో జీతాలు రాక హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నవంబరు 30వ తేదీన కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ పార్టీల గువ్వ గుయ్యమనే విధంగా బీఎస్పీకి ఓట్లు వేయాలి. బీర్లు క్వార్టర్లు మా పేదలకు డబ్బులు పదవులు మీకా.. ..? అన్ని కులాలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పార్టీ బీఎస్పీ మాత్రమే. బీఎస్పీ పార్టీ అధికారంలోకి ఓస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ రోడ్డెక్కితే ప్రజలు రాళ్లతో కొడుతున్నారు. కేసీఆర్ ఈ ఎన్నికల్లో గద్దె దించాలి. కోయ, లంబాడి చిరు ఉద్యోగులు ఇచ్చిన విరాళాలతో హెలికాప్టర్‌తో వస్తున్నాను. రేపటి రోజున బహుజనులే హెలిక్యాప్టర్లకు ఓనర్లు అవుతారు’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

Updated Date - 2023-11-17T18:18:40+05:30 IST