Share News

PM Modi Speech: ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారు: మోదీ

ABN , First Publish Date - 2023-11-27T16:39:18+05:30 IST

మరో 24 గంటల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అగ్రస్థాయి నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పలుచోట్ల ప్రచారం నిర్వహించారు.

PM Modi Speech: ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారు: మోదీ

కరీంనగర్: మరో 24 గంటల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అగ్రస్థాయి నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్‌లో బీజేపీ సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఆట ముగియనుంది. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. తెలంగాణ బీజేపీ తొలి సీఎం బీసీయే అవుతారు. చరిత్రలో 16 మహాజనపదాల్లో అస్మక జనపదం ఈ ప్రాంతం. హుజూరాబాద్‌ ఉపఎన్నికతో కేసీఆర్‌కు ట్రైలర్‌ చూపించాం. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారు’’ అని ప్రధాని మోదీ అన్నారు. పీవీ నరసింహరావుని కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగులో అవమానించిందని హస్తం పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు.

తెలంగాణకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సర్కార్లు అవసరం లేదని మోదీ అన్నారు. గ్యారెంటీలను నెరవేర్చే మోదీ సర్కార్‌ తెలంగాణకు అవసరమని అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే అందరికీ ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే అందరికీ ఆరోగ్యం, మోదీ గ్యారెంటీ అంటే రైతులకు చేయూత అని అన్నారు. ప్రజా సంక్షేమమే బీజేపీ ప్రాధాన్యతని, ఓ వైపు కేసీఆర్‌ ఉన్నారు.. మరో వైపు మీ సేవకుడు మోదీ ఉన్నాడని ప్రధాని అన్నారు.

Updated Date - 2023-11-27T16:40:12+05:30 IST