MLA Chandrappa: మరో ఆరు నెలల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఉండదో కూడా తెలియదు
ABN , First Publish Date - 2023-11-14T15:40:37+05:30 IST
మరో ఆరు నెలల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఉంటుందో ఉండదో కూడా తెలియదని, ఆ పార్టీలో 5 గ్రూపులు ఉన్నాయని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప ( MLA Chandrappa ) ఎద్దేవ చేశారు.
చేవెళ్ల: మరో ఆరు నెలల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఉంటుందో ఉండదో కూడా తెలియదని, ఆ పార్టీలో 5 గ్రూపులు ఉన్నాయని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప ( MLA Chandrappa ) ఎద్దేవ చేశారు. మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 కేజీల బియ్యం అట్టర్ ఫ్లాప్ అయింది. విద్యానిధి కింద 3 వేలు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. ప్రతి మహిళకు ప్రతి నెల 2 వేలు ఇస్తామన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇవన్నీ చెప్పి 6 నెలలు దాటింది. ఇక తెలంగాణ ప్రభుత్వం సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అన్ని సకాలంలో సాధ్యమవుతాయి. బీజేపీ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మంచి జరుగుతుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. ప్రజలు మరోసారి మోసపోవద్దు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందో మీ స్నేహితులను అడిగి తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ నేతలను గ్యారెంటీలు ఇవ్వమని ఎవరు అడిగారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ 25 ఎంపీ స్థానాలు గెలుస్తుంది. బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రభుత్వ భూములు కూడా అమ్ముకుంటున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల స్థానం బీజేపీదే. బీజేపీ పార్టీ చేవెళ్ల అభ్యర్థి కేఎస్ రత్నంకు చాలా మంచి పేరుంది’’ అని ఎమ్మెల్యే చంద్రప్ప పేర్కొన్నారు.