Share News

KTR: రాహుల్ ఛాలెంజ్‌కు నేను సిద్ధం..

ABN , First Publish Date - 2023-11-06T15:52:43+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

KTR: రాహుల్ ఛాలెంజ్‌కు నేను సిద్ధం..

రాజన్న సిరిసిల్ల: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) వచ్చి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలా అని అడుగుతున్నారు. రాహుల్ గాంధీ ఛాలెంజ్‌కి నేను సిద్ధం. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఆనాడు కాంగ్రెస్‌తో నమ్మి పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజుల్లో బలిదేవత సోనియా అమ్మ.. అని రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అన్నాడు, నేను అనడం లేదు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండు. కాంగ్రెస్‌తో (Congress) మాత్రమే పోటీ.. ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ కాదు. ఒక్క కేసీఆర్ (CM KCR) ఎంత ఉంటాడు. గింతంత ఉంటాడు. ఆయనను కొట్టడానికి ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు. సింహం సింగిల్ గానే వస్తుంది.. పందులు గుంపు గుంపులుగా వస్తాయి. డీకే శివకుమార్ (DK Shivakumar) నెత్తి మీద పాలు పోసి పోయాడు. నాశనం చేసి పోయాడు. ఇక పిలవడం లేదు. బేకర్ గాల్లు మనకు అవసరమా. గుజరాత్, ఢిల్లీ వాడు వచ్చిన కేసీఆర్‌ను ఏం చేయలేరు. కేసీఆర్‌ను బొండిగే పిసుకేందుకు చూస్తున్నారు. తెలంగాణ భవిషత్ తెలంగాణ గల్లీలోనే కావాలి’’ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-06T15:52:44+05:30 IST