Share News

Harish Rao: తెలంగాణ బిచ్చమ్ వేశారట?.. అవమానపరిచేలా మాట్లాడితే ఖబడ్డార్..

ABN , First Publish Date - 2023-11-24T15:11:10+05:30 IST

Telangana Elections: లీడర్లను కొనవచ్చు కానీ తమ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేరని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ... రాహుల్, ప్రియాంకలు కర్ణాటకలో అయిదు హామీలు చెప్పారని.. అక్కడి ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. వారు అధికారంలోకి వచ్చాక ఉన్న కరెంటు పోయిందన్నారు.

Harish Rao: తెలంగాణ బిచ్చమ్ వేశారట?.. అవమానపరిచేలా మాట్లాడితే ఖబడ్డార్..

కామారెడ్డి: లీడర్లను కొనవచ్చు కానీ తమ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేరని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ... రాహుల్, ప్రియాంకలు కర్ణాటకలో అయిదు హామీలు చెప్పారని.. అక్కడి ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. వారు అధికారంలోకి వచ్చాక ఉన్న కరెంటు పోయిందన్నారు. వారి పరిస్థితి పెనం మీది నుండి పోయిల పడ్డట్టు అయిందని తెలిపారు. వైఎస్ పీరియడ్లో ఉచిత కరెంటు అని ఉత్త కరెంటు చేసిండ్రని వ్యాఖ్యలు చేశారు. ‘‘కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా? కరెంటు కావాలంటే కారుకు ఓటు వేయండి. కేసీఆర్ ఇంత మంచిగ చేయంగా కాంగ్రెస్ వాళ్ళను నమ్ముడు ఎందుకు.. రిస్క్‌ల పడుడు ఎందుకు?’’ అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారని.. రైతులకు తిరిగి డబ్బులు ఇచ్చింది ఒకే ఒక్కడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. తమ పథకాలు కాంగ్రెస్ వాళ్లు నకల్ కొట్టారు కానీ ఆఖల్ లేదన్నారు. కేసీఆర్ ఎకరాకు రూ.16 వేలు ఇస్తా అంటే కాంగ్రెస్ వాళ్లు రైతుకు రూ.15వేలు అంటున్నారన్నారు.


‘‘ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను (AICC Chief Mallikharjuna Kharge) అడుగుతున్నా.. మీ ఊళ్ళో నీళ్లు, రోడ్లు సరిగా వస్తున్నాయా.. తెలంగాణ బిచ్చమ్ వేశారట.. కానీ మేము పోరాడి సాధించుకున్నాం. మమ్మల్ని అవమాన పరిచేలా మాట్లాడితే ఖబడ్దార్. మీ కర్ణాటక కంటే తెలంగాణ నూరు శాతం బాగుంది. కర్ణాటకలో కరువు వచ్చింది.. బియ్యం పంపుమని అడుగుతున్నారు. ఇతర రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా మారింది తెలంగాణ. ఇక్కడున్న ఓ లీడర్ అందరినీ కొంటున్నాడు. బీఆర్‌ఎస్ లీడర్ సురేందర్ పేదోడు.. కానీ పనులు బాగా చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యత నేను తీసుకుంటా. పది వేల ఇండ్లు నేను ఇప్పిస్తా. కేసీఆర్ పక్కన కామారెడ్డిలో ఉన్నారు.. ఎల్లారెడ్డిని కూడా ఆయనే అభివృద్ధి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల మాటేమో కానీ, ఆరు నెలలకోసారి ముఖ్యమంత్రి మారడం ఖాయం’’ అంటూ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-24T15:11:11+05:30 IST