Share News

TS Polls: ‘ఎక్కడికి రమ్మన్నా వస్తా’.. కేసీఆర్, కేటీఆర్‌కు కర్ణాటక మంత్రి సవాల్

ABN , First Publish Date - 2023-11-23T16:05:39+05:30 IST

Telangana Elections: కర్ణాటక కరెంట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కే.జే జార్జ్ సవాల్ విసిరారు. కర్ణాటక కరెంట్‌పై చర్చించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ కోసం సాయంత్రం ఆరు గంటల వరకు గాంధీ భవన్‌లో ఎదురుచూస్తానని తెలిపారు. చర్చలకు ఎక్కడికి రమ్మన్నా తాను సిద్ధమేనని జార్జ్ ప్రకటించారు.

TS Polls: ‘ఎక్కడికి రమ్మన్నా వస్తా’.. కేసీఆర్, కేటీఆర్‌కు కర్ణాటక మంత్రి సవాల్

హైదరాబాద్: కర్ణాటక కరెంట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్‌కు (Minister KTR) కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్ సవాల్ విసిరారు. కర్ణాటక కరెంట్‌పై చర్చించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ కోసం సాయంత్రం 6 గంటల వరకు గాంధీ భవన్‌లో (Gandhi Bhavan) ఎదురుచూస్తుంటానని చెప్పారు. చర్చలకు ఎక్కడికి రమ్మన్నా తాను సిద్ధమేనని జార్జ్ ప్రకటించారు.

గురువారం గాంధీభవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో కరెంట్ లేదని కేసీఆర్ అబద్ధాలు చెప్పుతున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో రైతులకు అవసరమైన కరెంట్ ఇస్తున్నామని, కొన్ని అవాంతరాలు వచ్చినా కూడా వాటిని అధిగమించి రైతులకు అవసరమైన కరెంట్ అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ఇక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారంటే అది గత కాంగ్రెస్ ప్రభుత్వ కృషి ఫలితమేనని కర్ణాటక మంత్రి చెప్పుకొచ్చారు.


జార్జ్ ఇంకా మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో 90 శాతం అమలులోకి తెచ్చామని తెలిపారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్రలో (Bharath Jodo Yatra) పాదయాత్ర చేసినప్పుడు అనేక మందితో ప్రత్యేకంగా కలిశారన్నారు. ప్రజల నుంచి వచ్చిన అన్ని విజ్ఞప్తులను ఆయన మేనిఫెస్టోలో పెట్టి అమలు చెయ్యాలని చెప్పారని తెలిపారు. మన్మోహన్ సింగ్ (Manmohan Singh), సోనియాగాంధీ (Sonia Gandhi) ఇద్దరూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. కర్ణాటకలో తాము 5 గ్యారంటీలు ఇచ్చామని.. వాటిని అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్ సమావేశంలో వాటిని అమలు చేస్తున్నామని తెలిపారు. అన్న భాగ్య పథకం కింద 10 కిలోల బియ్యం పేదలకు ఉచితంగా ఇస్తామన్నామని.. కానీ కేంద్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేయకపోవడంతో తాము పేదలకు బియ్యం డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ (Indira Gandhi) అమలు చేసిన 20 సూత్రాల పథకం ఇప్పటికీ అమలు అవుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge), సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ విస్తరిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తోందని కర్ణాటక మంత్రి కే.జే జార్జ్ వెల్లడించారు.


కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు ఆడుతున్నారు: అజయ్ కుమార్

కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తుందని ఏఐసీసీ మీడియా ఇంచార్జి అజయ్ కుమార్ (AICC Media Incharge Ajay Kumar) తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ అన్నీ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్‌ఘడ్ నుంచి పవర్ ఎందుకు కొంటుందని ప్రశ్నించారు. అంటే తెలంగాణలో ఇక్కడ పవర్ ఉత్పత్తి అవడం లేదన్నారు. ఇక్కడి ప్రభుత్వం కర్ణాటక డిస్కమ్స్‌కు 3 వేల కోట్ల రూపాయలు బకాయి ఉందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) అమలు చేస్తున్న కరెంట్‌పై కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ కర్ణాటక మంత్రి ఉన్నారని.. కరెంట్‌పై చర్చలకొస్తే ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు వేచి చూస్తామని చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-23T16:32:02+05:30 IST