Share News

Hemant Biswasharma: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి

ABN , First Publish Date - 2023-11-24T22:26:12+05:30 IST

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అస్సాం సీఎం హేమంత్ బిస్వాశర్మ ( Hemant Biswasharma ) వ్యాఖ్యానించారు.

Hemant Biswasharma: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి

వికారాబాద్ జిల్లా: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అస్సాం సీఎం హేమంత్ బిస్వాశర్మ ( Hemant Biswasharma ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు పరిగిలో అస్సాం సీఎం హేమంత్ బిస్వాశర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరిగి బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్‌తో కలిసి రోడ్ షో‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ తీసివేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తాం. హైదరాబాద్‌లో అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసులను బూతులు తిట్టి బెదిరిస్తున్నారు..ఓవైసీ బ్రదర్స్ హైదరాబాద్‌లో గొడవ చేయకండి... మీకు వీసా ఇప్పిస్తా.. వెళ్లి హమాస్ తరపున పోరాడండి. కేసీఆర్ సర్కార్ పేపర్ లీకేజీలతో నిరుద్యోగులను మోసం చేసింది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే పేద నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాలిస్తాం. బీజేపీ ప్రభుత్వం రాగానే కేసీఆర్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెడతాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి నాయకుడు అన్ని రాష్ట్రాల్లో ఉండాలి. చత్తీస్‌ఘడ్ , రాజస్థాన్, తెలంగాణలలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ప‌రిగిలో బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ గెలుపు ఖాయం. పరిగి ప్రాంతాన్నిఅభివృద్ధి చేస్తాం’’ అని హేమంత్ బిస్వాశర్మ అన్నారు.

Updated Date - 2023-11-24T22:26:17+05:30 IST