Share News

Ponguleti Srinivasreddy: కేసీఆర్ చెంపచెళ్లుమనే సమాధానం చెప్పాలి..

ABN , First Publish Date - 2023-11-20T11:18:48+05:30 IST

జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బీరోలులో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Ponguleti Srinivasreddy: కేసీఆర్ చెంపచెళ్లుమనే సమాధానం చెప్పాలి..

ఖమ్మం: జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బీరోలులో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Congress Candidate Ponguleti Srinivas reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మీరు గెలిపించిన ఎమ్మెల్యే అభివృద్ధి కోసం పార్టీ మారాను అని చెప్పారు.. మీ గ్రామంలో ఏం అభివృద్ధి చేశారు’’ అని ప్రశ్నించారు. అధికార పార్టీలో చేరి డబుల్ బెడ్ రూం ఇల్లు, దళిత బందు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చారా అని నిలదీశారు. ఆయన స్వలాభం కోసం బీఆర్‌ఎస్‌లో (BRS) చేరి కేసీఆర్‌కు (CM KCR) తొత్తుగా మారారని ఆరోపించారు. డబ్బు మదంతో, అధికార మదంతో విర్రవీగుతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి, ప్రజా పరిపాలనకు జరుగుతున్న యుద్ధం ఇదన్నారు.

ఈ యుద్ధంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెండు సార్లు తెలంగాణా ప్రజలకు మాయమాటలు చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని.. తెలంగాణా బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటీ చంద్రశేఖర్ రావు నెరవేర్చలేదని విమర్శించరు. కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి రెండు పర్యాయాలు చెయ్యలేకపోయాను.. ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే అద్భుతాలు చేస్తాను అని చెపుతున్నారన్నారు. ఇలాంటి మాయమాటలు చెప్పే వ్యక్తిని నమ్ముదామా అని అన్నారు. ‘‘ప్రజాపాలన కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం, మీ శ్రీనన్న గెలుపు కోసం మీరందరూ యుద్ధం చేసి కేసీఆర్ చెంపచెళ్లు మనే సమాధానం చెప్పాలి’’ అని పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-20T11:18:49+05:30 IST