Share News

CM KCR : సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

ABN , First Publish Date - 2023-11-16T20:20:48+05:30 IST

సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు ( Bullets ) కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేసీఆర్ నర్సాపూర్‌ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి.

 CM KCR : సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

మెదక్ జిల్లా: సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు ( Bullets ) కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేసీఆర్ నర్సాపూర్‌ సభలో పాల్గొన్నారు.ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి. కేసీఆర్ సభలో ప్రసంగిస్తుండగా అస్లాం అనే యువకుడు అనుమానాస్పందంగా తిరుగుతుండడంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు. అస్లాం నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌కి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


122338.jpg

Updated Date - 2023-11-16T21:09:21+05:30 IST