Share News

TS Polls: బూత్ విజిట్‌కు రేవంత్.. అడ్డుకున్న బీఆర్‌ఎస్.. కామారెడ్డిలో హైటెన్షన్

ABN , First Publish Date - 2023-11-30T15:48:34+05:30 IST

Telangana Elections: కామారెడ్డి పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలోని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్‌ నేతలు అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. బూత్ వైస్ పోలింగ్ స్టేషన్లను విజిట్ చేసిన రేవంత్‌ను బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల హోరా హోరీ నినాదాలతో బూత్ వద్ద హైటెన్షన్ నెలకొంది.

TS Polls: బూత్ విజిట్‌కు రేవంత్.. అడ్డుకున్న బీఆర్‌ఎస్.. కామారెడ్డిలో హైటెన్షన్

కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలోని ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని (TPCC Chief Revanth Reddy) బీఆర్ఎస్‌ నేతలు (BRS Leaders) అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. బూత్ వైస్ పోలింగ్ స్టేషన్లను విజిట్ చేసిన రేవంత్‌ను బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress), బీఆర్‌ఎస్ శ్రేణుల హోరా హోరీ నినాదాలతో బూత్ వద్ద హైటెన్షన్ నెలకొంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



మరోవైపు కామారెడ్డిలో పోలింగ్ కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 59శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగానూ 52 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మరోవైపు పోలింగ్ ముగియడానికి మరో గంట సమయం మాత్రమే ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

Updated Date - 2023-11-30T15:52:31+05:30 IST