Jio Users: జియో సిమ్ యూజర్లూ.. నెలవారీ రీఛార్జ్‌లతో ఇబ్బందా? ఈ ప్లాన్ చేసుకోండి చాలు 388 రోజులపాటు..

ABN , First Publish Date - 2023-02-06T16:39:06+05:30 IST

జియో యూజర్ల కోసం ఒక ఏడాది ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను టెలికం దిగ్గజం జియో (Jio) ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఆ ప్లాన్లతో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదికిపైగా వ్యాలిడిటీతో ఎక్స్‌ట్రా డేటాతోపాటు అదనపు సేవలు పొందొచ్చు. ఆ ఆఫర్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..

Jio Users: జియో సిమ్ యూజర్లూ.. నెలవారీ రీఛార్జ్‌లతో ఇబ్బందా? ఈ ప్లాన్ చేసుకోండి చాలు 388 రోజులపాటు..

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ (SmartPhone) యుగమిది. విద్యార్థయినా, ఉద్యోగయినా.. ఇలా ఎవరు ఏ పని చేస్తున్నా సరే స్మార్ట్‌ఫోన్ వినియోగం తప్పనిసరయ్యింది. అయితే ఫోన్ ఒక్కటే ఉంటే ఉపయోగం లేదు. ఆ ఫోన్ మనకు ఉపయోగపడాలంటే కాలింగ్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే యూజర్ల అవసరానికి అనుగుణంగా టెలికం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్‌ను (Recharge plans) ప్రవేశపెడుతుంటాయి. నిజానికి కొంతమంది కస్టమర్లకు డేటా Internet data) వినియోగం తక్కువగానే ఉంటుంది. అలాంటివారికి కాలింగ్ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్స్ సరిపోతాయి. అయితే మరికొంతమంది యూజర్లు సోషల్ మీడియా, ఇతర యాప్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అలాంటి వారికి డేటా అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాంటి యూజర్లు నెలనెలా రీఛార్జ్ పాట్లు పడడం కాస్త ఇబ్బందికరమే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జియో యూజర్ల కోసం ఒక ఏడాది ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను టెలికం దిగ్గజం జియో ( Reliance Jio) ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఆ ప్లాన్లతో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదికిపైగా వ్యాలిడిటీతో ఎక్స్‌ట్రా డేటాతోపాటు అదనపు సేవలు పొందొచ్చు. ఆ ఆఫర్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..

జియో యూజర్లు (Jio users) నెలవారి డేటా అవసరాల కోసం సాధారణంగా ప్రతి నెలా రూ.349‌తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నెట్ ఎక్కువ అవసరంలేని యూజర్లకు రూ.209 నెలవారీ ప్యాక్ అందుబాటులో ఉంది. ఇక డేటా వినియోగం ఎక్కువగా ఉన్న యూజర్లు ఏడాది ప్లాన్లను ఎంచుకుంటే అదనపు ప్రయోజనం పొందొచ్చు. నెలనెలా రీఛార్జ్‌కు బదులుగా రూ.2999 వార్షిక ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవడం అదనపు ప్రయోజనకరం. ఈ ఆఫర్‌తో ఏడాదికిపైగా వ్యాలిడిటీ లభిస్తుంది. 365 రోజులు + 23 రోజులు మొత్తం 388 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. ఇక రోజుకు 2.5 జీబీల డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అంతేకాకుండా అదనంగా జియో టీవీ (Jio TV), జియో సినిమా (Jio cinema) సేవలు ఉచితంగా పొందొచ్చు. మరి నెలనెలా తక్కువ మొత్తం రీఛార్జ్‌లకు బదులు ఏడాది ప్లాన్స్ మేలని భావించే యూజర్లు ఈ ప్లాన్‌ను ఎంజాయ్ చేయడం ఉత్తమం.

Updated Date - 2023-02-06T16:40:04+05:30 IST