Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోందోచ్!.. ఏఏ వస్తువులపై ఆఫర్స్ ఉన్నాయంటే..?

ABN , First Publish Date - 2023-09-21T09:20:59+05:30 IST

వీలైనంత తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ వస్తువలను కొనలానుకుంటున్నవారికి శుభవార్త. త్వరలోనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభంకాబోతుంది.

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోందోచ్!.. ఏఏ వస్తువులపై ఆఫర్స్ ఉన్నాయంటే..?

వీలైనంత తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ వస్తువలను కొనలానుకుంటున్నవారికి శుభవార్త. త్వరలోనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభంకాబోతుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఫ్లిప్‌కార్టులో హోం పేజీలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు సంబంధించిన టీజర్ పేజీ ప్రత్యక్షమవుతోంది. సదరు టీజర్ పేజీలో త్వరలో ఫిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభంకానున్నట్టుగా ఉంది. అయితే ఇది కేవలం టీజర్ పేజీ మాత్రమే. సేల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ఉన్న లిస్టింగ్ చూస్తే అక్టోబర్ మొదటి వారంలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ప్రారంభమవుతుందని సమాచారం. అలాగే ఈ సారి కూడా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్‌లు లభించనున్నాయని అర్థమవుతోంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా అక్టోబర్‌లో వచ్చే దసరా, నవంబర్‌లో వచ్చే దీపావళి పండుగలే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్స్‌ను తీసుకోస్తుంది.

image-1-24.webp


సేల్ పేజీలో చూపిస్తున్న వివరాల ప్రకారం.. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మంచి డిస్కౌంట్‌తో లభించే వస్తువుల విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్‌లు అతి తక్కువ ధరకు లభించనున్నాయి. ఇందులో Samsung Galaxy S21 FE 5G, ఐఫోన్‌లు కూడా ఉన్నాయి. ఐ ఫోన్‌లు అక్టోబర్ 1 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అక్టోబర్ 3 నుంచి శాంసంగ్ (Samsung), అక్టోబర్ 6 నుంచి రియల్‌మీ (Realme) ఫోన్‌ల విక్రయాలు ప్రారంభమవుతాయి. అదే విధంగా అక్టోబర్ 7 నుంచి రెడ్‌మీ (Redmi), అక్టోబర్ 8 నుంచి ఒప్పో (Oppo), పోకో( Poco) అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. Flipkart కూడా అక్టోబర్ 8న అన్ని ఫోన్ ఒప్పందాలను వెల్లడించాలని యోచిస్తోంది.

1-2.webp

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై 50 నుంచి 80 శాతం తగ్గింపు లభించనుంది. ఇయర్‌ఫోన్‌ల ప్రారంభ ధర రూ.499, కీబోర్డ్‌ల ప్రారంభ ధర రూ.99గా ఉండనుంది. వైడ్ స్క్రీన్ మానిటర్‌లపై 70 శాతం, ప్రింటర్‌లపై 60 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. టీవీలు, ఇతర ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపు లభించనుంది. కొన్ని జనాదరణ పొందిన 4K స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఎప్పటిలాగే ఈ సారి కూడా రష్ అవర్స్ డీల్‌లు, బంపర్ వాల్యూ అవర్స్, సూపర్ వాల్యూ కాంబోస్ ఉండున్నాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 14లపై కూడా ఆఫర్‌లు ఉండున్నాయి. కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 13 128GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.52,999గా ఉంది. ఐఫోన్ 14 ధర రూ.64,999కి గా ఉంది.

Updated Date - 2023-09-21T10:56:17+05:30 IST